// // Psychological Thriller OTT: భర్త లేని టైమ్ లో భార్యను దారుణంగా... -->
E-Paper
Advertisement

Psychological Thriller OTT: భర్త లేని టైమ్ లో భార్యను దారుణంగా… రివేంజ్ అంతకు మించి… క్రాక్ ఎక్కించే స్టోరీ

Psychological Thriller OTT: భర్త లేని టైమ్ లో భార్యను దారుణంగా… రివేంజ్ అంతకు మించి… క్రాక్ ఎక్కించే స్టోరీ
Advertisement

Psychological Thriller OTT : ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఓటీటీ ప్లాట్ ఫామ్. ఏ భాషలో కావాలన్నా, ఏ కంటెంట్ లో కావాలన్నా ఇంట్లోనే చూస్తూ ఎంటర్టైన్ అయిపోతున్నారు ప్రేక్షకులు. ఇక ఈ నేపథ్యంలో ఒక డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమా గురించి మనం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈ ఇరానియన్ సినిమాకి ఆస్కార్ కూడా వచ్చేసింది. ఈ సినిమా ఉత్తమ విదేశీ కేటగిరీలో ఈ అవార్డును అందుకుంది. ఆస్కార్ వచ్చేంతగా ఈ సినిమాలో ఏముంది? ఈ స్టోరీ ఏమిటి ? ఏ ఓటీటీలో చూడొచ్చు ? అనే వివరాల్లోకి వెళితే…

ప్రైమ్ వీడియోలో

వరల్డ్ క్లాస్ డైరెక్టర్ అస్గర్ ఫర్హాదీ దర్శకత్వంలో 2016లో వచ్చిన ఈ ఇరానియన్ మూవీ పేరు ‘ది సేల్స్‌మన్’ (The Salesman). ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకోవడమే కాకుండా, ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడు షహాబ్ హొస్సేనీ, ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డులు వచ్చాయి. ఆర్థర్ మిల్లర్ రాసిన పాపులర్ నవల “డెత్ ఆఫ్ ఏ సేల్స్‌మన్” నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా ఐయండిబిలో 7.7 రేటింగ్ తో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఎమాద్, రాణా అనే దంపతులు,స్టేజ్ ఆర్టిస్ట్ లుగా ఒక పాత ఇంట్లో జీవిస్తుంటారు. అది కూలిపోయే ప్రమాదం ఉండటంతో, ఒక స్నేహితుడి సహాయంతో వేరే ఫ్లాట్‌కి మారుతారు. అయితే ఆ ఫ్లాట్‌లో అంతకుముందు ఉన్న మహిళ ప్రవర్తన సరిగ్గా ఉండదు. ఆమె చాలా మందితో తిరిగిన మనిషి. ఇదే వాళ్ళకు శాపంగా మారుతుంది. ఒకరోజు రాణా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ పాత మహిళ కోసం ఎవరో వ్యక్తి తలుపు తడతాడు. రాణా తన భర్తే వచ్చాడనుకొని తలుపు తీయడం, ఆ వ్యక్తి లోపలికి చొరబడి ఆమెపై దాడి చేయడం జరిగిపోతాయి. ఆ పెనుగులాటలో రాణా తీవ్రంగా గాయపడుతుంది. ఆ ఆగంతకుడు తన వస్తువులను అక్కడే వదిలేసి పారిపోతాడు.

ఇక పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని రాణా భయపడు తుంది. ఇక ఎమాద్ కోపంతో ఆ అపరిచితుడిని వేటాడటం మొదలుపెడతాడు. ఆ వ్యక్తి వదిలేసిన ట్రక్కు, సెల్ ఫోన్ ఆధారంగా వాడిని వెతుకుతూ వెళ్తాడు. చివరకు ఆ వ్యక్తిని ఎమాద్ కనిపెడతాడు. అయితే అతను ఊహించినట్టు వాడు ఎవరో గూండా కాదు. బయటకు చాలా గౌరవప్రదంగా కనిపించే ఒక ముసలాయన. పెళ్లి కాబోతున్న కూతురు, భార్య ఉన్న ఆ వ్యక్తి ఇలాంటి తప్పు చేశాడని తెలిసి ఎమాద్ ఆశ్చర్యపోతాడు.ఇక క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ముగుస్తుంది. ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? ఎమాద్ అతనికి ఎలాంటి శిక్ష వేస్తాడు ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : దీవిలో భార్యతో ఏకాంతంగా… సైకోల టార్చర్ కి చుక్కలు… చూస్తే దిమాక్ ఖరాబ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×