E-Paper
Advertisement

Psychological thriller OTT : రాత్రయితే భార్యతో సైకోలా మారే భర్త … పని మనిషితో రెచ్చిపోయి… మైండ్ బ్లాక్ చేసే క్లైమాక్స్

Psychological thriller OTT : రాత్రయితే భార్యతో సైకోలా మారే భర్త … పని మనిషితో రెచ్చిపోయి… మైండ్ బ్లాక్ చేసే క్లైమాక్స్
Advertisement

Psychological thriller OTT : గత ఏడాది థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో కుడా మంచి రెస్పాన్స్ తో నడుస్తోంది. ఒక పనిమనిషి చుట్టూ తిరిగే ఈ స్టోరీ కుర్చీలకు కట్టిపడేస్తోంది. నేర చరిత్ర ఉన్న ఒక యువతి, ఒక ధనిక కుటుంబం వద్ద పనిమనిషిగా చేరుతుంది. అయితే ఆ ఇంట్లోని దంపతుల వెనుక ఉన్న భయంకరమైన సీక్రెట్స్ ఆమెను ఎలా ప్రమాదంలోకి నెట్టాయి అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా పేరు ? ఎక్కడ చూడచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

పాల్ ఫీగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘హౌస్‌మెయిడ్’ (The Housemaid). ఫ్రీడా మెక్‌ఫాడెన్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా ఇది రూపొందింది. ఈ మూవీ 2025 డిసెంబర్ 19న అమెరికాలో థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. సుమారు $385 మిలియన్లతో సూపర్ హిట్ అయింది. ఇందులో మిల్లీ పాత్రలో సిడ్నీ స్వీనీ, నినా పాత్రలో అమండా సెైఫ్రెడ్, ఆండ్రూ పాత్రలో బ్రాండన్ స్క్లెనార్ నటించారు. విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న ఈ మూవీ 2026 ఫిబ్రవరి 12 నుండి Apple TVలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది కేవలం రెంటల్ పద్దతిలోనే చూడాల్సి ఉంటుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మిల్లీ అనే యువతికి గతంలో కొన్ని నేరాలు చేసిన చరిత్ర ఉంటుంది. దానివల్ల ఆమెకు ఉద్యోగం దొరకడం కష్టమవుతుంది. అలాంటి సమయంలో నినా అనే బాగా డబ్బున్న మహిళ ఇంట్లో పనిమనిషిగా మిల్లీకి అవకాశం ఇస్తుంది. ఆ ఇంట్లో నినా, ఆమె భర్త ఆండ్రూ కలిసి ఉంటారు. మొదట్లో అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా, వెళ్ళేకొద్దీ నినా ప్రవర్తన చాలా వింతగా మారుతుంది. కావాలనే ఇల్లంతా గందరగోళం చేయడం, మిల్లీని ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తుంటుంది. అయితే ఆండ్రూ మాత్రం చాలా నెమ్మదస్తుడిగా ఉంటూ మిల్లీకి అండగా నిలుస్తాడు.

కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ ఇల్లు బయటికి కనిపించేంత ప్రశాంతంగా ఉండదు. మిల్లీ ఉండే గది బయటి నుండి లాక్ అయ్యేలా ఉండటం ఆమెలో అనుమానం పెంచుతుంది. ఆ ఇంట్లో దంపతుల మధ్య ఏదో రహస్యం ఉందని తెలుసుకుంటుంది. ఆ తరువాత నినా కంటే ఆండ్రూనే ఎక్కువ ప్రమాదకరమని మిల్లీకి అర్థమవుతుంది. చివరికి మిల్లీని ఒక ట్రాప్‌లో పడేయాలని చూస్తున్న ఆ దంపతుల నుండి ఆమె ఎలా బయటపడింది ? ఆ ఇంట్లో ఉన్న చీకటి నిజాలు ఏంటి ? మిల్లీని పనిమనిషిగా ఎందుకు పెట్టుకున్నారు ?అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : పెళ్లికి ముందు అలాంటి పని… కళ్ళు తెరిపించే క్లైమాక్స్… పొట్ట చెక్కలయ్యే కామెడీ కూడా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×