E-Paper
Advertisement

ఇక్కడ చంపకపోతే, చావు తలుపు తడుతుంది… సస్పెన్స్ తో మెంటలెక్కించే థ్రిల్లర్

ఇక్కడ చంపకపోతే, చావు తలుపు తడుతుంది… సస్పెన్స్ తో మెంటలెక్కించే థ్రిల్లర్
Advertisement

Psychological Thriller OTT : ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎంటర్టైన్మెంట్ కి వేదికగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమాలు కూడా థియేటర్లకు వెల్లకుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. డిజిటల్ ఆడియన్స్ ఇంట్లోనే కూర్చుని హాయిగా వీటిని చూస్తూ ఆనందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఒక థ్రిల్లర్ సినిమా థియేటర్ల గడప తొక్కకుండానే డిజిటల్ ఆడియన్స్ ను పలకరించింది. ఈ సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో కూడా నిలిచింది. ఒక సీరియల్ కిల్లర్ ట్రాప్ లో పడే మహిళ చుట్టూ ఈ కథ ఉంటుంది. చూస్తే చిల్లింగ్ థ్రిల్ పక్కా ఉంటుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ జర్మన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా “ది క్యాలెండర్ కిల్లర్” (The Calendar Killer). ఈ సినిమా జర్మనీకి చెందిన ప్రముఖ రచయిత సెబాస్టియన్ ఫిట్జెక్ రాసిన ‘డెర్ హైమ్‌వెగ్’ అనే సూపర్ హిట్ నవల ఆధారంగా రూపొందింది. దీనిని అడాల్ఫో జె. కోల్మెరర్ అనే దర్శకుడు తెరకెక్కించారు. ఈయనకు ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్లను తీయడంలో మంచి అనుభవం ఉంది. కేవలం 1 గంట 37 నిమిషాల నిడివితో సాగే ఈ చిత్రం, ప్రేక్షకులను క్షణం కూడా పక్కకు తిప్పుకోనివ్వకుండా టెన్షన్‌ను మెయింటైన్ చేస్తుంది. ఇక నటీనటుల విషయానికొస్తే, క్లారా పాత్రలో లూయిస్ హెయర్ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అలాగే జూల్స్ పాత్రలో సాబిన్ టాంబ్రియా తన వాయిస్‌తోనే సినిమా సగానికి పైగా నడిపిస్తాడు. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే గ్లోబల్ లెవల్లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ, 2025 జనవరి16న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

క్లారా అనే మహిళను ఒక వింత సీరియల్ కిల్లర్ టార్గెట్ చేస్తాడు. వాడు ఒక వింత కండిషన్ పెడతాడు. డిసెంబర్ 6 అర్ధరాత్రి లోపు నీ భర్తను నువ్వే చంపేయాలి, లేదంటే నిన్ను నేను చంపేస్తానని డెడ్ లైన్ పెడతాడు. చావు అంచున ఉన్న క్లారా దిక్కుతోచక రోడ్డు మీద పరుగు తీస్తుంది. అలా పరుగు తీస్తూ భయం భయంగా ఒక హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేస్తుంది. అక్కడ జూల్స్ అనే వ్యక్తి ఫోన్ ఎత్తుతాడు. క్లారా తన పరిస్థితిని వాడికి చెప్తూ ఏడుస్తుంది. జూల్స్ ఆమెను ధైర్యం చెప్తూ, మాటల్లో పెట్టి సేఫ్‌గా ఇంటికి చేర్చాలని ట్రై చేస్తాడు. కానీ ఆ కిల్లర్ వీళ్ల వెంటే ఉన్నాడని, ప్రతి అడుగు గమనిస్తున్నాడని అర్థమయ్యాక సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. క్లారాకి ఒక్కొక్కటిగా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఆ కిల్లర్ ఎవరు? క్లారా నిజంగానే తన మొగుడిని చంపిందా? లేక కిల్లర్ చేతిలో చిక్కిందా? అనేది అసలు ట్విస్ట్. కథ చివర్లో వచ్చే మలుపులు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే మనం ఎవరినైతే నమ్ముతామో, వాళ్ళే ఇందులో అసలు విలన్లలా కనిపిస్తారు.

Read Also : కోరిక తీర్చుకొనే ప్రియుడు…పగతో రగిలిపోయే ప్రియురాలు… ఈ సినిమా పెద్దలకు మాత్రమే

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×