E-Paper
Advertisement

Mystery Thriller OTT : గోడలో దాగి ఉన్న కాళీమాత… వరుస హత్యలతో వల్లకాడుగా మారే మ్యాన్షన్… క్షణక్షణం ఉత్కంఠ రేపే మర్డర్ మిస్టరీ

Mystery Thriller OTT : గోడలో దాగి ఉన్న కాళీమాత… వరుస హత్యలతో వల్లకాడుగా మారే మ్యాన్షన్… క్షణక్షణం ఉత్కంఠ రేపే మర్డర్ మిస్టరీ
Advertisement

Mystery Thriller OTT : ఓటీటీలో ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే జానర్లలో సైకలాజికల్ థ్రిల్లర్ కూడా ఒకటి. మిస్టీరియస్ ట్విస్టులతో ఆకట్టుకునే ఇలాంటి సినిమాలు మొదటి నుంచి క్లైమాక్స్ వరకూ ఎంగేజింగ్ గా ఉంటాయి. ఇలాంటి సినిమాలను కన్నార్పకుండా చూసే వాళ్ళ కోసమే ఈ మూవీ సజెషన్. మరి మూవీ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

2023లో విడుదలైన బెంగాలీ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘శ్వేతకాలీ’ (Shwetkali). సాని ఘోష్ రే డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ రిచ్ ఫ్యామిలీస్, వాళ్ళ సీక్రెట్స్, సూపర్‌నాచురల్ ఎలిమెంట్స్ చుట్టూ తిరుగుతుంది. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ షో 2023 ఫిబ్రవరి 24న జీ5 (ZEE5) ఓటీటీలో రిలీజ్ అయింది. బెంగాలీ బెస్ట్ థ్రిల్లర్స్‌ లో ఒకటిగా ప్రశంసలు అందుకున్న ఈ సిరీస్ బెంగాలీ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఆప్షన్ లో అందుబాటులో ఉంది.

Advertisement

ఓంద్రిల్లా సేన్ ఉర్వి పాత్రలో, షాహెబ్ భట్టాచార్జీ పలాష్ పాత్రలో నటించారు. ఓంద్రిల్లా ఓటీటీ డెబ్యూ ఇదే కావడం విశేషం. సపోర్టింగ్‌ రోల్స్ లో సౌరవ్ చక్రవర్తి, అరిందమ్ గంగులి, దేబ్దుత్ ఘోష్, దేవ్లినా కుమార్, సమదర్శి దత్తా, స్వాగతా బాసు, రిషి కౌశిక్ తదితరులు ఉన్నారు. ఓంద్రిల్లా సేన్ పెర్ఫార్మెన్స్ స్టాండౌట్, ఇతరులు కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చారు. సాని ఘోష్ రే డైరెక్షన్‌లో సస్పెన్స్ బిల్డప్, ఇంటర్‌పర్సనల్ రిలేషన్స్ బాగా చూపించారు. ఇప్పుడు పూర్తి సిరీస్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

Read Also : తల్లీ కూతుర్లతో డెడ్లీ డెత్ గేమ్… సొంతింట్లోనే ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు… మగదిక్కు లేనింట్లో మతిపోగొట్టే క్రైమ్

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

కథ రిచ్ బెంగాలీ ఫ్యామిలీస్ నుండి వచ్చిన ఉర్వి (ఓంద్రిల్లా సేన్), పలాష్ (షాహెబ్ భట్టాచార్జీ) ఎంగేజ్‌మెంట్ సెలబ్రేషన్‌తో స్టార్ట్ అవుతుంది. వాళ్ల ఫ్యామిలీస్ ఖరపని మాన్షన్ (పాత జమీందార్ ప్యాలెస్)లో పార్టీ ప్లాన్ చేస్తారు. ఎంగేజ్‌మెంట్ ప్రిపరేషన్స్ జరుగుతున్నప్పుడు ఒక గోడ పగిలి, లోపల నుండి వైట్ కాళీ మాత (శ్వేతకాలీ) విగ్రహం బయట పడుతుంది. గ్రామస్తులు దీన్ని అపశకునంగా భావిస్తారు. ఆ విగ్రహం బయట పడ్డాక ఫ్యామిలీ మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత మాన్షన్‌లో సీరియల్ మర్డర్స్ జరుగుతాయి.

ఫ్యామిలీ డాగ్, గెస్ట్ చనిపోతారు. ఉర్వి మిస్టరీని ఇన్వెస్టిగేట్ చేస్తూ, మాన్షన్‌కి 300 ఏళ్ల నాటి డార్క్ సీక్రెట్స్ ను బయట పెడుతుంది. సూపర్‌నాచురల్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ డ్రామాతో సస్పెన్స్ పీక్‌కి వెళ్తుంది. చివరి ఎపిసోడ్స్‌లో షాకింగ్ ట్విస్ట్స్ ఉంటాయి. మరి ఇంతకీ ఆ మాన్షన్ కు ఉన్న శాపం ఏంటి? ఎందుకు ఆ ఇంట్లో అందరూ చనిపోతున్నారు ? 300 ఏళ్లనాటి మిస్టరీ ఏంటి ? అన్నది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే. ‘శ్వేతకాలీ’ ఒక చిల్లింగ్ పైకలాజికల్ థ్రిల్లర్. హారర్, మిస్టరీ, డ్రామా అద్భుతంగా ఉంటుంది. కొంచెం స్లో పేసింగ్ ఉన్నా, థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి మస్ట్ వాచ్. రాత్రిపూట చూస్తే వణుకు గ్యారంటీ.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×