E-Paper
Advertisement

Psychological Thriller OTT : సైకాలజిస్ట్ కి చావు రుచి చూపించే దెయ్యాలు… అత్తారింట్లోనూ వదలకుండా… మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్

Psychological Thriller OTT : సైకాలజిస్ట్ కి చావు రుచి చూపించే దెయ్యాలు… అత్తారింట్లోనూ వదలకుండా… మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

Psychological Thriller OTT : సైన్స్, హారర్ ఎలిమెంట్స్ కలగలిపి తెరకెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్లకు మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. దెయ్యాలే లేవనే సైన్స్, దెయ్యాలే కాదు దేవతలు కూడా ఉన్నారు అనే మైథాలజీ… ఈ రెండు థీమ్స్ ను ఒకే స్టోరీలో చక్కగా డీల్ చేస్తే ఆడియన్స్ కు మంచి మూవీ దొరికినట్టే. ఇక ఈ జానర్లో వచ్చే సినిమాలను భాషతో సంబంధం లేకుండా ఓటీటీలో వీక్షిస్తున్నారు జనాలు. అలా బెంగాలీ థ్రిల్లర్లకు రోజు రోజుకూ ఆదరణ పెరిగిపోతోంది. ఈరోజు అలాంటి బెంగాలీ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ మన మూవీ సజెషన్.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

2023లో రిలీజ్ అయిన బెంగాలీ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రక్తకరబీ’ (Roktokorobi). సయంతన్ ఘోషాల్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ రవీంద్రనాథ్ ఠాగూర్ నాటకం టైటిల్ తో ఇన్‌స్పైర్ అయ్యింది. 11 ఎపిసోడ్స్ ఉన్న ఈ షో 2023 ఫిబ్రవరి 3న ZEE5లో రిలీజ్ అయింది. మెయిన్ లీడ్స్ గా విక్రమ్ చటర్జీ (సత్యకి – సైకాలజిస్ట్), రైమా సేన్ (రంజా – సత్యకి సిస్టర్-ఇన్-లా) నటించారు. రూక్మా రే, తులికా బసు, లబోనీ సర్కార్, శాంతిలాల్ ముఖర్జీ, భాస్వర్ చటర్జీ, అభిజిత్ గుహ, హరిదాస్ చటర్జీ సపోర్టింగ్ రోల్స్ పోషించారు. సయంతన్ ఘోషాల్ డైరెక్షన్‌లో సస్పెన్స్ బిల్డప్, షాకింగ్ ట్విస్ట్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి.

Advertisement

Read Also :  ఇదేం పిచ్చి ప్రేమ భయ్యా ? కనికరం లేకుండా మర్డర్స్… ఈ సైకో ఏంది భయ్యా ఇంత బ్రూటల్ గా ఉన్నాడు ?

స్టోరీలోకి వెళ్తే…

సినిమా అంతా సత్యకి (విక్రమ్ చటర్జీ) చుట్టూ తిరుగుతుంది. అతను బ్రిలియంట్ సైకాలజిస్ట్. కానీ తన పేషెంట్ కళ్లముందే సూసైడ్ చేసుకోవడంతో కాన్ఫిడెన్స్ కోల్పోతాడు. డిప్రెషన్ తో ప్రాక్టీస్ ను వదిలేస్తాడు. ఈ నేపథ్యంలోనే రంజా (రైమా సేన్) ఇన్వైట్ చేయడంతో ఊర్లోని తన అత్త ఇంటికి వెళ్తాడు. అక్కడ ఫ్యామిలీలో సడన్ డెత్స్, రంజా హాలుజినేషన్స్ అతన్ని టెన్షన్ పెడతాయి. సత్యకి ఈ మిస్టరీలను ఇన్వెస్టిగేట్ చేస్తూ, ఒక షాకింగ్ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ విషయం ఏంటి? ఎందుకు డాక్టర్ చుట్టూ ఉన్నవాళ్ళు చనిపోతున్నారు? అనేది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే. ఇందులో సూపర్‌ నాచురల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. కానీ సైకలాజికల్ థ్రిల్ డామినేట్ చేస్తుంది. ట్విస్ట్స్ ఫుల్‌గా ఉంటాయి, చివరి ఎపిసోడ్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తాయి. ఇది మిస్టరీ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి మస్ట్ వాచ్. డార్క్ మిస్టరీస్ ఇష్టపడేవాళ్లకి పర్ఫెక్ట్ ఛాయిస్.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×