// // Psychological Thriller OTT : టీచర్ చేతిలో నలిగిపోయే స్టూడెంట్... -->
E-Paper
Advertisement

Psychological Thriller OTT : టీచర్ చేతిలో నలిగిపోయే స్టూడెంట్… కన్ను పడితే రెచ్చిపోయే సైకో… ఉత్కంఠంగా నడిచే థ్రిల్లర్

Psychological Thriller OTT : టీచర్ చేతిలో నలిగిపోయే స్టూడెంట్… కన్ను పడితే రెచ్చిపోయే సైకో… ఉత్కంఠంగా నడిచే థ్రిల్లర్
Advertisement

Psychological Thriller OTT : టీచర్-స్టూడెంట్ మధ్య జరిగే ప్రేమకథలు చాలానే ఉన్నాయి. కొన్ని మంచి ఫీలింగ్ ఇస్తే, మరికొన్ని భయంకరమైన మలుపులు తిరుగుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా రెండో రకం. ఇందులో టీచర్-స్టూడెంట్ మధ్య జరిగే మైండ్ గేమ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమా ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడినప్పుడు విమర్శకుల నుండి మంచి మార్కులు కూడా కొట్టేసింది. ఈ సినిమాను కేవలం 12 రోజుల్లోనే షూట్ చేశారు. తక్కువ బడ్జెట్‌తో తీసినా, ఉత్కంఠతను మాత్రం బాగా మెయింటైన్ చేశారు. మొత్తానికి ఈ కథ ఒక తెలివైన స్టూడెంట్ కి, ఒక క్రూరమైన టీచర్ కి మధ్య జరిగే ఈ మైండ్ గేమ్ తో ఆడియన్స్ కి కావాల్సిన స్టఫ్ అయితే ఇస్తోంది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

నోమ్ క్రోల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘టీచర్స్ పెట్’ (Teacher’s Pet) ఇందులో క్లారా పాత్రలో మిచెల్ టోరియన్, మిస్టర్ హెల్లర్ (టీచర్) పాత్రలో ల్యూక్ బార్నెట్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా మొదట 2025 జూన్ 21 ‘డాన్సెస్ విత్ ఫిల్మ్స్’ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా Prime video, apple tv ప్లాట్‌ ఫామ్స్ లో ఇది అందుబాటులోకి వచ్చింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

క్లారా అనే అమ్మాయి హైస్కూల్‌లో భీభత్సమైన టాపర్. ఎలాగైనా పెద్ద కాలేజీలో సీటు కొట్టాలని పిచ్చెక్కించే రేంజ్‌లో చదువుతుంటుంది. సరిగ్గా అదే టైంలో మిస్టర్ హెల్లర్ అనే కొత్త ఇంగ్లీష్ టీచర్ వస్తాడు. మొదట్లో అతను చాలా మంచోడిలా నటిస్తూ, క్లారా టాలెంట్‌ని మెచ్చుకుంటూ ఆమెకు బాగా దగ్గరవుతాడు. కానీ మెల్లమెల్లగా అసలు రంగు బయటపెడతాడు. వాడు మామూలు టీచర్ కాదు, ఎదుటివారి మైండ్‌తో ఆడుకునే ఒక సైకో అని క్లారాకు అర్థమవుతుంది.

అతను క్లారాను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తూ, ఆమె కెరీర్‌ను, ప్రాణాన్ని రిస్కులో పడేస్తాడు. వాడు వేసే ప్లాన్లు, చేసే మెంటల్ టార్చర్ కి క్లారాకు పిచ్చెక్కిపోతుంది. ఒకానొక సమయంలో ఆ టీచర్ వేధింపులు తట్టుకోలేక, ఆ సైకో గాడి నుండి తనను తాను కాపాడుకోవడానికి క్లారా కూడా అంతే రేంజ్‌లో ఎదురుదాడి చేయాల్సి వస్తుంది. ఈ పోరులో ఎవరిది పై చేయి అవుతుంది ? హెల్లర్ చేతిలో క్లారా నలిగిపోతుందా ? హెల్లర్ పై రివేంజ్ తీర్చుకుంటుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  వరణాసిలో వరుడి కష్టాలు… ప్రియుడికి వింత కండిషన్ పెట్టే పిల్ల తండ్రి… ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×