E-Paper
Advertisement

Psychological Thriller OTT : నాలుగేళ్ల కూతురిపై దారుణం… తల్లి రివేంజ్ ఊర మాస్… ఐయండిబిలో టాప్ రేటింగ్

Psychological Thriller OTT : నాలుగేళ్ల కూతురిపై దారుణం… తల్లి రివేంజ్ ఊర మాస్… ఐయండిబిలో టాప్ రేటింగ్
Advertisement

Psychological Thriller OTT : రివెంజ్ థ్రిల్లర్ సినిమాలు చాలానే ఉన్నాయి ఓటీటీలో. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమా ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. ఆస్కార్ రేసులో కూడా నిలిచింది. ఇది బిడ్డ చావుకు, ఓ తల్లి తీర్చుకునే రివేంజ్. ఇందులో ప్రతీకారం మామూలుగా అయితే ఉండదు. అదిరిపోయే స్క్రీన్ ప్లే తో ఈ సినిమా కేక పెట్టిస్తుంది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

స్టోరీ ఏమిటంటే

ఈ జపాన్ నుంచి వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘కన్ఫెషన్స్’ (Confessions). 2010లో వచ్చిన ఈ సినిమాకు టెట్సుయా నకాషిమా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో టకాకో మట్సు ఒక స్కూల్ టీచర్ గా నటించింది. ఇది కనే మినాటో రాసిన నవల ఆధారంగా రూపొందింది. విమర్శకుల నుంచి అత్యధిక ప్రశంసలను అందుకుంది ఈ సినిమా. ఇది 34వ జపాన్ అకాడమీ ప్రైజ్, 53వ బ్లూ రిబ్బన్ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రంగా కూడా అవార్డు పొందింది. అంతేకాదు 83వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా షార్ట్‌లిస్ట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

యూకో అనే మహిళ ఒక స్కూల్ లో టీచర్ గా పని పని చేస్తుంటుంది. తన తన 4 ఏళ్ల కూతురు మాన్‌చాన్‌ని స్కూల్ స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోతుంది. అయితే ఇది హత్య అని, తన క్లాస్‌లోని ఇద్దరు విద్యార్థులే దీనికి కారణమని త్వరలోనే తెలుసుకుంటుంది. చట్టం ప్రకారం మైనర్ విద్యార్థులకు శిక్ష పడదని గ్రహించి, ఆమె తనదైన స్టైల్ లో ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది.

ఆమె ఆ స్కూల్ నుంచి వెళ్లిపోతూ ఒక బాంబ్ పేలుస్తుంది. చివరిగా ఒక స్పీచ్ ఇస్తూ, తన బిడ్డ స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయిందని అందరూ అనుకుంటున్నారని, కానీ తన క్లాస్‌లోని ఇద్దరు విద్యార్థులే తన కూతురిని హత్య చేశారని చెప్తుంది. దానికి కారణం ఎవరో తనకు తెలుసని, మైనర్లకు చట్టపరంగా కఠిన శిక్షలు పడవు కాబట్టి, తానే వారికి శిక్ష విధించానని చెబుతుంది. ఆ ఇద్దరు విద్యార్థులు తాగిన పాల గ్లాసుల్లో హెచ్‌ఐవి రక్తాన్ని కలిపానని యూకో అందరి ముందు సంచలన ప్రకటన చేసి వెళ్ళిపోతుంది.

Advertisement

ఇక ఆ ఇద్దరూ హెచ్ఐవి సోకిందనే భయంతో మానసికంగా కుంగిపోతారు. ఆ తరువాత స్టోరీ మరింత ఇంటెన్సివ్ గా సాగుతుంది. రివేంజ్ పరాకాష్టకు చేరుకుంటుంది. చివరికి ఈ సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? ఆ ఇద్దరు స్టూడెంట్స్ ఏమవుతారు ? అనే విషయాలను, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : తండ్రికి దూరమయ్యే కొడుకు… భార్యను కాపాడలేక … ఎమోషన్ అంటే ఇదే మావా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×