E-Paper
Advertisement

ఇంట్లో ఇల్లాలు ఆఫీస్ లో ప్రియురాలు… మైండ్ బెండింగ్ ట్విస్టులతో అదరగొడుతున్న సిరీస్

ఇంట్లో ఇల్లాలు ఆఫీస్ లో ప్రియురాలు… మైండ్ బెండింగ్ ట్విస్టులతో అదరగొడుతున్న సిరీస్
Advertisement

Psychological thriller OTT : ప్రేక్షకులు ఎక్కువగా థ్రిల్లర్ కంటెంట్ నే లైక్ చేస్తుంటారు. ఇక వీటిలో వహించని ట్విస్ట్లు, అదిరిపోయే క్లైమాక్స్ ఉంటే దాన్ని అస్సలు వదిలిపెట్టరు. ఈ నేపథ్యంలో మనం ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ గురించి చెప్పుకోవాల్సిందే. మొదట్లో ఇది కేవలం ఒక ఆఫీస్ బాస్‌తో అక్రమ సంబంధం, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న మామూలు డ్రామాలా అనిపిస్తుంది కానీ లోపల ఏదో పెద్ద మిస్టరీ ఉంటుందనే ఉత్కంఠను కలిగిస్తుంది. కథ మధ్యలోకి వచ్చేసరికి సూపర్‌నేచురల్ ఎలిమెంట్ తోడయ్యి, క్లైమాక్స్‌లో అసలు ఊహించని విధంగా మతిపోయే ట్విస్ట్ ఇస్తుంది. దీనికి ఐయండిబిలో 7.2 రేటింగ్ కూడా ఉంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ కు కావాల్సినంత కిక్ ఇచ్చే సిరీస్ ఇది.

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

2021లో వచ్చిన ఈ బ్రిటిష్ సైకలాజికల్ థ్రిల్లర్ మినీ సిరీస్ పేరు ‘బిహైండ్ హర్ ఐస్’ (Behind Her Eyes). ఇందులో సిమోనా బ్రౌన్ (లూయిస్), ఈవ్ హివ్సన్ (అడిలె), టామ్ బాట్‌మన్ (డేవిడ్) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సిరీస్ 2017లో వచ్చిన సారా పిన్‌బరో నవల ఆధారంగా రూపొందింది. ఈ వెబ్ సిరీస్‌లో అడిలెగా నటించిన ఈవ్ హివ్సన్, ప్రపంచ ప్రసిద్ధ రాక్ స్టార్ బోనో కుమార్తె కావడంతో ఈమె నటనపై భారీ అంచనాలు ఉండేవి, వాటిని ఆమె తన అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్లింది. దర్శకుడు ఎరిక్ రిక్టర్ స్ట్రాండ్ కథను నడిపించిన తీరు చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. కేవలం ఆరు ఎపిసోడ్లే ఉండటం వల్ల ఈ సిరీస్ వీకెండ్‌లో చూసేయడానికి ఒక మంచి ఆప్షన్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఇది నెట్ ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

లూయిస్ అనే ఒక యువతి తన బాస్ అయిన డేవిడ్‌తో అఫైర్ పెట్టుకుంటుంది. అదే సమయంలో ఆమెకు డేవిడ్ భార్య అడిలె పరిచయమై మంచి స్నేహితురాలు అవుతుంది. అడిలె చూడటానికి చాలా అమాయకంగా, భర్త చేతిలో హింసించబడుతున్నట్లు కనిపిస్తుంది. కానీ వీరిద్దరి వెనుక ఏదో భయంకరమైన గతం ఉందని లూయిస్‌కు అనుమానం మొదలవుతుంది. అడిలెకు ‘అస్ట్రల్ ప్రొజెక్షన్’ (నిద్రలో ఆత్మను శరీరం నుండి బయటకు పంపడం) అనే విద్య తెలుసు. ఆమె ఆ విద్యను లూయిస్‌కు కూడా నేర్పిస్తుంది. కథ ముందుకు వెళ్లేకొద్దీ, గతంలో అడిలెకు రాబ్ అనే ఒక స్నేహితుడు ఉండేవాడని, అతను చనిపోయాడని తెలుస్తుంది.

అయితే అసలు నిజం ఏంటంటే, రాబ్ తన ఆత్మను అడిలె శరీరంలోకి మార్చేసి, అసలైన అడిలెను చంపేసి, ఆమె రూపంలోనే చలామణి అవుతుంటాడు. చివరికి రాబ్ కన్ను లూయిస్ మీద పడుతుంది. ఒక ప్లాన్ ప్రకారం లూయిస్ ఆత్మ తన శరీరం నుండి బయటకు వచ్చేలా చేసి, తన (అడిలె) శరీరంలో ఉన్న రాబ్ ఆత్మ లూయిస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా లూయిస్ చనిపోతుంది, రాబ్ ఇప్పుడు లూయిస్ రూపంలో డేవిడ్‌ను పెళ్లి చేసుకుంటాడు. పాపం డేవిడ్‌కు తన పక్కన ఉన్నది తన భార్యను చంపిన రాబ్ అని తెలియదు. ఈ సిరీస్ క్లైమాక్స్ ను చూసినోల్లంతా బిత్తరపోయారు కూడా.

Advertisement

Read Also : పడకగదిలో చిచ్చు పెట్టిన మాయావి… ప్రేమించిన భార్యను కాదని మరో అమ్మాయి మోజులో భర్త… అన్నీ అలాంటి సీన్లే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×