E-Paper
Advertisement

Psychological Thriller OTT : కాజల్ నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ డిలీట్… ఇదే చివరి తేదీ

Psychological Thriller OTT : కాజల్ నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ డిలీట్… ఇదే చివరి తేదీ
Advertisement

Psychological Thriller OTT : అందాల భామ కాజల్ అగర్వాల్ నటించిన ఒక మూవీ వార్తల్లో నిలిచింది. దాదాపు 8 సంవత్సరాల క్రితం ఓటీటీలోకి వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా మూవీ 2026 ఫిబ్రవరి 14న ప్రేమకుల దినోత్సవం రోజున ఓటీటీలోనుంచి వైదొలగనుంది. అయితే ఈ చిత్రం సాంకేతిక విభాగాల్లో రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా సంపాదించడం అప్పట్లో ఒక విశేషం. ఈ మూవీ పేరు ఏమిటి? ఏ ఓటీటీ నుంచి తప్పుకోనుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ 

ఇది ‘హను మాన్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అయిన ‘అవే’ (Awe)సినిమా. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేనితో కలిసి నటుడు నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా 2026 ఫిబ్రవరి 14 నుంచి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ ప్లాట్‌ఫామ్ నుండి తొలగించబడుతోంది. ఇది ఆమె ఫ్యాన్స్ కి కొంచెం నిరాశ కలిగించే విషయమే. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 2018లో విడుదలైన ఈ సినిమాలో నిత్యా మీనన్, రెజీనా కసాండ్రా, ఈషా రెబ్బా, ప్రియదర్శి పుల్లికొండ, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ సినిమా కథ మొత్తం ఒక రెస్టారెంట్‌లో జరుగుతుంది. ఇందులో ఒక మాంత్రికుడు, ఒక సైంటిస్ట్, ఒక చెఫ్, ఒక డ్రగ్ అడిక్ట్ ఇలా వేర్వేరు వ్యక్తుల కథలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా సాగుతుంటాయి. ఆడియన్స్ కూడా అయోమయంలో పడుతుంటారు. అయితే క్లైమాక్స్‌లో ఈ పాత్రలన్నీ ‘కాళి’ (కాజల్ అగర్వాల్) అనే ఒకే యువతిలోని వివిధ రకాలుగా తిరిగే మానసిక స్థితి (Multiple Personality Disorder) అని తెలియడంతో  ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ కథలో ఆమె చిన్నప్పుడు జరిగిన ఒక చేదు సంఘటన కారణంగా, ఆ పాత్రలను తనకు తెలీకుండానే ఆమె  ఊహించుకుంటుంది. ఇది క్లైమాక్స్ లోనే తెలుస్తుంది. మరి ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా క్లైమాక్స్ ని మీరు కూడా చూడాలనుకుంటే దీనిపై ఓ లుక్ వేయండి. ఆ తరువాత చూడాలనుకున్నా ఉండకపోవచ్చు.

Read Also : 22 అవార్డులను గెలుచుకున్న 2 గంటల 20 నిమిషాల యాక్షన్ డ్రామా… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×