E-Paper
Advertisement

Psychological horror thriller OTT: వెంటపడుతూ వణికించే దెయ్యం… నరకం చూసే ఫ్యామిలీ… గుండె గట్టిగా ఉంటేనే చూడండి

Psychological horror thriller OTT: వెంటపడుతూ వణికించే దెయ్యం… నరకం చూసే ఫ్యామిలీ… గుండె గట్టిగా ఉంటేనే చూడండి
Advertisement

Psychological horror thriller OTT : ఎన్ని సినిమాలు చూసినా, దయ్యాల సినిమాలు చూస్తే వచ్చే కిక్కే వేరు. ఇందులో ఆడియన్స్ ని భయపెట్టడానికి దర్శకులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. సౌండ్ ఎఫెక్ట్స్ తో ఒంట్లో వణుకు పుట్టిస్తుంటారు. ఇక ఈ నేపథ్యంలో ఎన్నో హారర్ సినిమాలో వచ్చాయి. కొన్ని భయంకరంగా ఉంటే మరి కొన్ని థ్రిల్లర్ మోడ్ లో ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే హారర్ మూవీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ దయ్యం సంవత్సరాలుగా ఇద్దరు పిల్లలు వెంటపడుతూ ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే హారర్ సీన్స్ టెన్షన్ పెడుతూ ఉంటాయి. ఇందులో రక్తపాతం కంటే ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మామూలు దెయ్యం సినిమాల్లాగా కేవలం భయపెట్టడమే కాకుండా, మనుషుల ఎమోషన్స్ ఎలా పీడిస్తాయో కూడా చూపిస్తుంది. ఓ మంచి హారర్ సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమాను చూసేయొచ్చు.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

2021లో వచ్చిన ఈ హారర్ సినిమా పేరు ‘వెన్ ఐ కన్స్యూమ్ యూ’ (When I Consume You) ఇది పెర్రీ బ్లాక్‌షియర్ దర్శకత్వం వహించిన ఒక సూపర్‌నేచురల్ హారర్ డ్రామా. ఈ చిత్రంలో లిబ్బీ ఈవింగ్ (డాఫ్నే), ఇవాన్ డుమౌచెల్ (విల్సన్ షా) అక్కాతమ్ముళ్లుగా ప్రధాన పాత్రల్లో నటించగా, మాక్లియోడ్ ఆండ్రూస్ కీలక పాత్ర పోషించారు. తక్కువ బడ్జెట్‌తో నిర్మించినప్పటికీ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ఈ సినిమా Apple tvలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ కథ డాఫ్నే, విల్సన్ అనే అక్కాతమ్ముళ్ల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పెరుగుతారు. డాఫ్నే తన తమ్ముడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అతనికి ఏ చిన్న కష్టం వచ్చినా అండగా నిలబడుతుంది. అయితే ఒక వింతైన భయంకరమైన శక్తి, వాళ్ళను ఎప్పటి నుంచో వెంటాడుతూ ఉంటుంది. ఒకరోజు ఆ శక్తి దాడి చేయడంతో డాఫ్నే చనిపోతుంది. కానీ పోలీసులు అది డ్రగ్స్ వల్ల జరిగిన మరణం అని కొట్టిపారేస్తారు.

ఇక తన అక్కను కోల్పోయిన బాధలో ఉన్న విల్సన్‌కు, ఉన్నట్టుండి ఆమె ఆత్మ కనిపిస్తుంది. ఆ భయపెట్టే దుష్ట శక్తి మళ్ళీ వస్తుందని, ఈసారి పగ తీర్చుకోవడానికి తనే స్వయంగా రెఢీ గా ఉండాలని ఆమె అతనికి చెబుతుంది. విల్సన్ అప్పటి వరకు చాలా అమాయకుడిగా, భయస్తుడిగా ఉన్నప్పటికీ, తన అక్క కోసం మొండిగా మారతాడు. చివరకు ఆ భయంకరమైన శక్తిని విల్సన్ ఎలా ఎదుర్కొన్నాడు ? తన అక్కకు ఎలా న్యాయం చేశాడు ? అనేదే ఈ సినిమా ముగింపు.

Advertisement

Read Also : అమెజాన్ అడవుల్లో హడలెత్తించే అడ్వెంచర్… ప్రాణాలు అరచేతిలో… ఉత్కంఠ రేపే ప్రతీ సీన్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×