// // Psycho Thriller OTT : విల్లాలో వింత సంఘటనలు... -->
E-Paper
Advertisement

Psycho Thriller OTT : విల్లాలో వింత సంఘటనలు… అతిథులను ఆహ్వానించి ఇదేం పని భయ్యా ?

Psycho Thriller OTT : విల్లాలో వింత సంఘటనలు… అతిథులను ఆహ్వానించి ఇదేం పని భయ్యా ?
Advertisement

Psycho Thriller OTT : ఓటీటీలలో ఉండే సైకో థ్రిల్లర్ సినిమాలకే ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. కానీ అందులో హర్రర్ మిక్స్ తో అది వేరే లెవెల్ కిక్కు అంతే. ఈ రెండు జానర్ల కాంబోలో వచ్చిన ఓ ఇంట్రెస్టింగ్ సినిమానే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీలో చెప్పుకునేటంత ప్రత్యేకత ఏముంది ? ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2024లో రిలీజ్ అయిన మోస్ట్ డిస్టర్బింగ్ థ్రిల్లర్ పేరే ‘స్పీక్ నో ఈవిల్’ (Speak No Evil). సైకలాజికల్ హారర్ ఫ్యాన్స్ కి ఇంటెన్స్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఈ సినిమాకు జేమ్స్ వాట్కిన్స్ దర్శకత్వం వహించారు. 2022లో వచ్చిన ఓ డానిష్ ఫిల్మ్ కు ఈ అమెరికన్ రీమేక్ గా రూపొందింది. బ్లమ్‌హౌస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీలో జేమ్స్ మెక్‌అవాయ్, మాకెంజీ డేవిస్, స్కూట్ మెక్‌నైరీ, అలిక్స్ వెస్ట్ లెఫ్లర్, ఐస్లింగ్ ఫ్రాన్సియోసి ప్రధాన పాత్రలు పోషించారు. 1 గంట 50 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ మూవీ 2024 సెప్టెంబర్ 13న బిగ్ స్క్రీన్ పై సందడి చేసింది. ఇక ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. సైకో, హారర్ ఎలిమెంట్స్ తో పాటు బ్రూటల్ సీన్స్ ఉంటే బాగుంటుంది అనుకునే వారు ఈ మూవీపై ఒక లుక్కేయొచ్చు.

Advertisement

Read Also :  మూగపిల్లను ర్యాంగింగ్ చేసే గ్యాంగ్ మర్డర్ మిస్టరీ… సీను సీనుకో ట్విస్ట్

స్టోరీలోకి వెళ్తే…

సాధారణంగా పక్కింటి వాళ్ళు, కొలీగ్స్ లేదా మంచి పరిచయస్తులు అయితే… ఏదో ఒక సందర్భంలో ఒకరింటికి ఒకరు ఆహ్వానించుకుంటారు. ఆ టైమ్ లో గెస్ట్ లకు విందు భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. ఇక ఆ తరువాత విందును ఆరగించి సంతోషంగా ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తారు. కానీ లైఫ్ లాంగ్ అదొక అద్భుతమైన మెమొరీగా ఉండిపోతుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే సినిమాలో మాత్రం ఆ ఆహ్వానమే ఒక పీడకల అవుతుంది.

Advertisement

ఇక కథలోకి వెళ్తే… లూయిస్ (మాకెంజీ డేవిస్), బెన్ (స్కూట్ మెక్‌నైరీ) అనే అమెరికన్ దంపతులుఉంటారు. వాళ్లకి ఒక కూతురు ఉంటుంది. ఆమె పేరు అగ్నెస్ (అలిక్స్ వెస్ట్ లెఫ్లర్). ఈ ఫ్యామిలీ చుట్టూనే కథ తిరుగుతుంది. ఇటలీ హాలిడేస్ లో బ్రిటిష్ డాక్టర్ పాడీ (జేమ్స్ మెక్‌అవాయ్), ఆయన వైఫ్ సి (ఐస్లింగ్ ఫ్రాన్సియోసి), కొడుకు ఆంట్ (డానికా కర్వోసో)తో అమెరికన్ ఫ్యామిలీ క్లోజ్ అవుతుంది. ఆ హరువత పాడీ ఫ్యామిలీ ఇంగ్లండ్‌ లో ఉన్న తమ ఊరికి వీళ్ళని ఆహ్వానిస్తాడు. అక్కడికి వెళ్ళాక గుండె జారిపోయే టర్న్ తీసుకుంటుంది కథ. మరి ఆ టర్న్ ఏంటి ? అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది ? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×