E-Paper
Advertisement

Psycho Thriller OTT : తల్లి కోసం సీరియల్ కిల్లర్ గా… 57 మందిని దారుణంగా… గుండె ధైర్యం ఉన్నోళ్లకే ఈ మూవీ

Psycho Thriller OTT : తల్లి కోసం సీరియల్ కిల్లర్ గా… 57 మందిని దారుణంగా… గుండె ధైర్యం ఉన్నోళ్లకే ఈ మూవీ
Advertisement

Psycho Thriller OTT : ఫుల్ రక్తం, మర్డర్లు, దయ్యం ఎలిమెంట్స్‌తో కొంచెం గట్టిగా ఉండే సినిమాను చూడాలనుకుంటున్నారా ? అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా పై ఓ లుక్ వేయండి. ఇది ఫిలిప్పీన్స్‌లో మొదటి సీరియల్ కిల్లర్‌గా గుర్తించబడిన, ఫాదర్ జువాన్ సెవెరినో మల్లారి జీవితంలోని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది. 19వ శతాబ్దంలో అనారోగ్యంతో ఉన్న తన తల్లిని రక్షించుకోవడానికి, ఆ ఫాదర్ 57 మందిని హత్య చేసినట్లు ఈ చిత్రం చూపిస్తుంది. ఇందులో బ్లడ్ బాత్ బాగా ఉంటుంది.

నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ హారర్ మూవీ పేరు ‘మల్లారి’ (Mallari). రోడెరిక్ కాబ్రిడో దర్శకత్వం వహించిన ఈ ఫిలిప్పైన్ మూవీలో ప్రధాన పాత్రలో పియోలో పాస్కల్ నటించారు. ఈ చిత్రం 2023 డిసెంబర్ 25న మెట్రో మనీలా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌ను ప్రదర్శించింది. ఇక్కడ ఇది ఉత్తమ సంగీతం, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్‌, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ చిత్రంగా నిలిచింది. 72వ FAMAS అవార్డ్స్‌లో, ఇది 14 నామినేషన్లను సంపాదించి, ఉత్తమ చిత్రంతో సహా 6 అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix)లో సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ1800ల కాలంలో మొదలవుతుంది. సెవెరినో మల్లారి అనే ఒక చర్చి ఫాదర్, చూడటానికి భక్తిపరుడిలా కనిపిస్తాడు. కానీ లోపల మాత్రం పెద్ద కిల్లర్. తన తల్లికి ఏదో పెద్ద జబ్బు చేస్తే, ఆమెను బతికించుకోవడానికి ఎవరో చెప్పిన పిచ్చి మాటలు నమ్మి.. ఊర్లో జనాల్ని వేటాడి చంపడం మొదలుపెడతాడు. ఒకరా ఇద్దరా.. ఏకంగా 57 మందిని చంపుతాడు. ఫిలిప్పీన్స్ చరిత్రలోనే ఇతనే ఫస్ట్ సీరియల్ కిల్లర్ అని కూడా చెప్పుకుంటారు. ఇక సినిమా ప్రెజెంట్ కాలానికి వస్తుంది. అదే వంశానికి చెందిన జోనాథన్ అనే కుర్రాడు సీన్‌లోకి వస్తాడు. వీడికి వింత వింత కలలు, ఫ్యూచర్ కనిపించడం లాంటివి జరుగుతుంటాయి.

ఇప్పుడు తన కాబోయే భార్య చనిపోబోతుందని తెలిసి, ఆమెను ఎలాగైనా కాపాడుకోవాలని తన సొంత ఊరికి వెళ్తాడు. అక్కడ తన ముత్తాతల కాలం నాటి పాత ఇంట్లోకి దూరితే గానీ అసలు విషయం అర్థం కాదు. ఆ పాత చర్చి ఫాదర్ చేసిన పాపాలు, ఆ శాపం ఇంకా వీళ్ళని వదలట్లేదని. ఇప్పుడు క్లైమాక్స్ మరింత హారర్ మోడ్ కి వెళ్తుంది. చివరికి జోనాథన్ తన భార్యను బతికించుకుంటాడా ? మనుషుల్ని చంపి బలి ఇస్తే చనిపోయినోళ్లు బతుకుతారా? లేక అదంతా ఒక మాయా? అనేది మాత్రం ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఓ వర్షం కురిసిన రాత్రి… ఫ్రెండ్ తమ్ముడితోనే యవ్వారం… ఐయండిబిలో టాప్ రేటింగ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×