E-Paper
Advertisement

Psycho Saiyaan OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్ ‘సైకో సైయాన్’… ఎప్పుడు ఎక్కడ చూడవచ్చు అంటే?

Psycho Saiyaan OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్ ‘సైకో సైయాన్’… ఎప్పుడు ఎక్కడ చూడవచ్చు అంటే?
Advertisement

Psycho Saiyaan OTT : మరోసారి థ్రిల్లర్ లవర్స్‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో నడిచే ఒక ప్రేమ కథ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రేమ తీవ్ర వ్యామోహంగా మారితే, అది నేరాలకు ఎలా దారితీస్తుందో ఈ సిరీస్ కళ్ళకు కట్టినట్లు చూపించబోతోంది. బాలీవుడ్ సినీ పరిశ్రమ నుండి వస్తున్న ఈ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎందులో స్ట్రీమింగ్ అంటే

ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘సైకో సయ్యాన్’ (Psycho Saiyaan). ఈ సిరీస్‌ కు అజయ్ భూయాన్ దర్శకత్వం వహించారు. ఇందులో తేజస్వి ప్రకాష్, రవి కిషన్, అనుద్ సింగ్ ధాకా ప్రధాన పాత్రల్లో నటించగా,యశ్‌పాల్ శర్మ, అశ్విని కల్సేకర్, సురభి చందనా, వరుణ్ భగత్ వంటి నటులు సహాయక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 2026, ఫిబ్రవరి 25న Amazon MX Playerలో విడుదల కాబోతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో కూడా ఉచితంగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ట్రైలర్ ఇప్పటికే YouTube లో విడుదలై మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కూడా డబ్బింగ్ లో విడుదలయ్యే అవకాశం

స్టోరీ ఏమిటంటే

Advertisement

కార్తీక్ పాండే (అనుద్ సింగ్ ధాకా) అనే కుర్రాడు ఉజ్జయినిలో చదువుకుంటూ కవిత్వాలు రాస్తుంటాడు. అతను చారు (తేజస్వి ప్రకాష్) అనే అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమ కాస్తా నెమ్మదిగా ఒక ప్రమాదకరమైన వ్యామోహం లాగా మారిపోతుంది. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆరాటంలో కార్తీక్ హద్దులు దాటి ప్రవర్తించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఒక మామూలు ప్రేమకథ కాస్తా భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్‌గా మారుతుంది. మరోవైపు ఆ ఊరిలో పవర్‌ఫుల్ వ్యక్తిగా ఉన్న రవి కిషన్ పాత్ర ఈ కథలోకి ప్రవేశించడంతో పరిస్థితులు మరింత గందరగోళంగా మారుతాయి. అసలు కార్తీక్ తన ప్రేమ కోసం ఏ స్థాయికి వెళ్లాడు? అతని వల్ల చారు జీవితం ఎలాంటి ఇబ్బందుల్లో పడింది? ఈ క్రైమ్ డ్రామాలో మిగతా నేరగాళ్ల పాత్ర ఏంటి? అనే ఉత్కంఠభరితమైన అంశాలతో ఈ సిరీస్ సాగుతుంది.

Read Also : సిరీస్‌ గా రాబోతున్న మోస్ట్ డేంజరస్ అడవి దొంగ వీరప్పన్ జీవిత చరిత్ర… ఏ ఓటీటీలో ఎప్పుడు చూడచ్చు అంటే ?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×