E-Paper
Advertisement

Psych Siddhartha OTT : అనుకున్న దానికంటే ముందే ఓటీటీలోకి ‘సైక్’ సిద్ధార్థ’… కానీ చిన్న ట్విస్ట్

Psych Siddhartha OTT : అనుకున్న దానికంటే ముందే ఓటీటీలోకి ‘సైక్’ సిద్ధార్థ’… కానీ చిన్న ట్విస్ట్
Advertisement

Psych Siddhartha OTT : ఈ కొత్త సంవత్సరంలో మొదటగా విడుదలై, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా ‘సైక్ సిద్ధార్థ’. లో బడ్జెట్ సినిమానే అయినా న‌టుడు శ్రీ నందు యాక్టింగ్ తో బాగానే ఆకట్టుకున్నాడు. దాదాపు 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమా జనవరి 1 న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి కూడా అడుగు పెట్టబోతోంది. మరి ఈ తెలుగు రొమాంటిక్ మూవీ ఏ ఓటీటీలోకి రాబోతోంది ? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది ? అనే వివరాలను తెలుసుకుందాం.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘సైక్ సిద్ధార్థ’ లో శ్రీ నందు, యామినీ భాస్కర్ ప్రధాన పాత్రల్లోనటించారు. ఇతర పాత్రల్లో సుకేష్ రెడ్డి, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, నర్సింహా నటించారు. శ్రీ నందు, రానా దగ్గుబాటి, శ్యామ్ సుందర్ రెడ్డి కలిసి ఈ ప్రాజెక్టును నిర్మించగా, స్మరన్ సాయి సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేశారు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీ 2026 ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులు 24 గంటల ముందుగానే సినిమాను చూడవచ్చు.

కథ ఏమిటంటే

Advertisement

సిద్ధార్థ (శ్రీనందు) అనే యువకుడికి త్రిష (ప్రియాంక‌) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆ త‌ర్వాత వీళ్ళు బిజినెస్ లోకి దిగుతారు. మ‌న్సూర్ (సుఖేష్‌రెడ్డి) అనే మరో వ్యక్తితో క‌లిసి ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మొదలుపెడతారు. అందులో సిద్ధార్థ నుంచి భారీగా పెట్టుబడి పెట్టిస్తారు. దాదాపు తన దగ్గర ఉన్న మొత్తం పెట్టుబ‌డి పెడతాడు సిద్ధార్థ‌. ఇక్కడే అసలు మోసం బయట పడుతుంది. మ‌న్సూర్‌, త్రిష కలసి పక్కా ప్లానింగ్ తో సిద్ధార్థను మోసం చేస్తారు. ఇక ఈ ఘరానా మోసంతో కోట్లు పోగొట్టుకుని రోడ్డుపైకి వ‌చ్చేస్తాడు సిద్ధార్థ‌. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో చాలా బాధపడతాడు.

ఇక బ‌స్తీలో ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం మొదలు పెడతాడు. ఇక్కడే మరో కథ మొదలవుతుంది. అదే బిల్డింగ్‌లోకి త‌న కొడుకుతో క‌లిసి అద్దెకు దిగుతుంది శ్రావ్య (యామినీ భాస్క‌ర్‌). ఆమె జవితంలో కూడా ఓ ట్రాజెడీ ఉంటుంది. శాడిస్ట్ భ‌ర్త పెట్టే హింస భరించలేక ఆమె బయటికి వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళ ఇద్దరి జర్నీ మొదలవుతుంది. చివరికి వీళ్ళ ప్రయాణం ఎలా మొదలవుతుంది ? ఎలాంటి మలువులు తిరుగుతుంది ? అనే విషయాలను ఈ తెలుగు రొమాంటిక్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  మహిళల్ని మాత్రమే చంపే మాస్క్ మ్యాన్… ఆ పార్ట్స్ కట్ చేసి అరాచకం భయ్యా… లాస్ట్ ట్విస్టుకు మైండ్ పోవడం పక్కా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×