E-Paper
Advertisement

OTT Movie : ముసలాడితో మాస్టర్ ప్లాన్… ఈ అమ్మాయి ఆశలకు అవాక్కవ్వాల్సిందే… గ్రిప్పింగ్ మలయాళ డ్రామా

OTT Movie : ముసలాడితో మాస్టర్ ప్లాన్… ఈ అమ్మాయి ఆశలకు అవాక్కవ్వాల్సిందే… గ్రిప్పింగ్ మలయాళ డ్రామా
Advertisement

OTT Movie : రియల్ సంఘటనలు ఆధారంగా ఎన్నో సినిమాలు వస్తున్నాయి. వీటిని ఆడియన్స్ అదరిస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక మలయాళం సినిమా ఫీల్ గుడ్ స్టోరీతో ఆడియన్స్ మనసును దోచుకుంది. 70 ఏళ్ల వృద్ధుడు, 19 ఏళ్ల బాలిక చుట్టూ తిరిగే ఈ స్టోరీ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక జర్నీలో మొదలయ్యే ఈ సినిమా, “లెట్స్ గో ఫర్ ఎ వాక్” అనే ట్యాగ్‌ లైన్‌తో వచ్చింది. థ్రిల్లర్, హారర్, యాక్షన్ సినిమాలు చూసి విసిగిపోయి ఉంటే, ఈ మలయాళం సినిమాపై ఓ లుక్ వేయండి. ఒక మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. దీనిపేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

దీపక్ డియాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫీల్ గుడ్ మలయాళం మూవీ పేరు ‘ప్రైవేట్’ (Private). ఇందులో ఇండ్రాన్స్ , మీనాక్షి ఆనోప్, అను ఆంటనీ మెయిన్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 10న థియేటర్స్‌లో విడుదలై, ఐయండిబిలో 9.3/10 రేటింగ్ పొందింది. 137 నిమిషాల రన్‌ టైమ్ తో నవంబర్ 21 నుంచి Manorama maxలో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్‌లో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కేరళలోని ఒక చిన్న టౌన్‌లో రామన్ అనే 70 ఏళ్ల రిటైర్డ్ పోస్ట్‌మాస్టర్ ఒంటరిగా ఉంటాడు. భార్య చనిపోయి పిల్లలు దూరంగా ఉన్నారు. అతను పాత కమ్యూనిస్ట్ ఆలోచనలు ఉన్నవాడు, కానీ ఇప్పుడు రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడడు. మౌనంగానే ఉంటాడు. రోజూ సాయంత్రం బీచ్‌కి వెళ్లి నడుస్తూ, పాత రోజులు గుర్తు చేసుకుంటూ గడుపుతాడు. ఒక రోజు బీచ్‌లోనే అతనికి పరిచయమవుతుంది అనన్య అనే 19 ఏళ్ల కాలేజీ అమ్మాయి. ఆమె చాలా రెబెల్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో పాలిటిక్స్, హిందుత్వ ఆలోచనల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతుంది. ఇంట్లో తండ్రి, అన్నయ్య ఆమెను బాగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. బయటికి వెళ్లనివ్వరు. ఒక రోజు ఆమె ఇవి భరించలేక ఇంట్లోంచి పారిపోతుంది. తన పెద్ద సిస్టర్ ఉండే కర్ణాటకలోని ఒక టౌన్‌కి ప్రయాణం మొదలు పెడుతుంది. డబ్బు లేదు, ఫోన్ లేదు, ఇక్కడే రామన్ అనన్య కలుస్తారు. అనన్యకి రోడ్డు మీద ఇబ్బంది వచ్చినప్పుడు రామన్ సాయం చేస్తాడు. ఆమె ఎక్కడికి తెలుసుకుని, నేను కూడా ఆ దారిలోనే వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఆమెతో పాటు వస్తాడు.

Read  Also : కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికెళ్లి చేయకూడని పని… ఇవాళ ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్

Advertisement

నిజానికి అతను ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఈ అమ్మాయి మీద జాలి, మరి కొంచెం ఆమె ఆలోచనలు తన యూత్‌ని గుర్తు చేసినందుకు కంపెనీ ఇస్తాడు. ఇద్దరూ కలిసి రోడ్ మీద నడుస్తూ, బస్సులు మారుస్తూ, రాత్రిపూట బెంచీల మీద పడుకుంటూ కర్ణాటక దాకా వెళ్తారు. ఈ జర్నీలోనే మెయిన్ కథ ఉంటుంది. రామన్ తన యూత్‌లో కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఎలా పాల్గొన్నాడో, ఎమర్జెన్సీ టైంలో ఎలా జైలుకు వెళ్ళాల్సి వచ్చిందో ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడో చెప్తాడు. అనన్య తన ఇంట్లో ఎందుకు ఊపిరి ఆడక ఇబ్బంది పడుతోందో చెప్తుంది. ఇద్దరి మధ్య ఒక అద్భుతమైన బంధం ఏర్పడుతుంది. చివర్లో ఈ ప్రయాణం వాళ్లిద్దరి జీవితాల్ని ఎలా మార్చేస్తుందనేదే ఎమోషనల్ గా ఉంటుంది.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×