E-Paper
Advertisement

మినిస్టర్ కొడుకు కిడ్నాప్… పోలీస్, యంగ్ హ్యాకర్ ల పాట్లు చూస్తే కితకితలె

మినిస్టర్ కొడుకు కిడ్నాప్… పోలీస్, యంగ్ హ్యాకర్ ల పాట్లు చూస్తే కితకితలె
Advertisement

Hacking Thriller OTT: మినిస్టర్ లాంటి పెద్ద మనుషుల ఇళ్ళల్లో చోరీలు జరిగినా, కిడ్నాప్ లు జరిగిన పరిస్థితి ఎంత గందరగోళంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ పోలీసులకు టెన్షన్ టెన్షన్ ఉంటుంది. మరి అసలు టెక్నాలజీ అంటేనే తెలియని ఓల్డ్ పోలీస్, టెక్నాలజీతో ఓ ఆట ఆడుకునే యంగ్ హ్యాకర్ కలిసి ఓ కేసును ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తే… ఊహించుకోవడానికే క్రేజీగా ఉంది కదా. ఈ ఇన్వెస్టిగేషన్ లో పడిన కామెడీ ఏంటో తెలుసుకోవాలంటే ఓటీటీలో సంచలనం సృష్టించిన తమిళ-హిందీ మిక్స్ సైబర్‌క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్ ప్రీతమ్ అండ్ పెడ్రో (Pritam and Pedro)పై లుక్కేయాల్సిందే. మరి ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెసులుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ అధునాతన సైబర్ క్రైమ్, ఓల్డ్-స్కూల్ పోలీసింగ్ మధ్య జరిగే హాస్యభరితమైన పోరాటం. గోవా క్రైమ్ బ్రాంచ్‌ లో పని చేసే సీనియర్ పోలీస్ ఆఫీసర్ పెడ్రో (అర్షద్ వార్సీ). చాదస్తపు మనస్తత్వం ఉన్న వ్యక్తి అతను. ఆయనకు కంప్యూటర్లు, టెక్నాలజీ గురించి అస్సలు తెలియదు. ఒక కేసు విషయంలో స్థానిక మంత్రిని ఎదిరించడంతో, అతనికి శిక్షగా ఏమాత్రం అవగాహన లేని సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌ కు బదిలీ చేస్తారు. కంప్యూటర్ స్క్రీన్ చూస్తేనే భయపడే పెడ్రో ఈ బదిలీని తన జీవితంలోని అతి పెద్ద శిక్షగా భావిస్తాడు.

Advertisement

మరోవైపు, ప్రీతమ్ (వీర్ హిరానీ) టెక్నాలజీలో ఎవరూ అందుకోలేనంత మేధావి. కేవలం 15 నిమిషాల్లోనే సెల్ టవర్‌ని హ్యాక్ చేయగల సామర్థ్యం అతనికి ఉంటుంది. కానీ నిజ జీవితంలో వ్యాక్యూమ్ క్లీనర్స్ అమ్ముకుంటూ ఉంటాడు. ఒక పోలీస్ గొడవ కేసులో ప్రీతమ్ అరెస్ట్ అయి స్టేషన్‌ కు వస్తాడు. అక్కడ ఒక పెద్ద ఏటీఎం దొంగతనం కేసును తన హ్యాకింగ్ స్కిల్స్‌తో కేవలం 15 నిమిషాల్లో సాల్వ్ చేసి పోలీసులను ఆశ్చర్యపరుస్తాడు.

ఇదిలా ఉండగా… టెక్నాలజీ తెలియని పెడ్రో, టెక్నాలజీలో కింగ్ అయిన ప్రీతమ్ ఇద్దరూ కలిసి ఒక డీల్ కుదుర్చుకుంటారు. అదే సమయంలో పెడ్రో ట్రాన్స్‌ఫర్‌ కు కారణమైన క్రీడా శాఖ మంత్రి కొడుకు విన్నీ కిడ్నాప్ అవుతాడు. కిడ్నాపర్లు రూ. 23 లక్షలు డిమాండ్ చేస్తారు. ఈ కిడ్నాప్ వెనుక ‘మార్టిన్’ (విక్రాంత్ మస్సే) అనే ఒక ప్రమాదకరమైన ప్రొఫెషనల్ సైబర్ క్రిమినల్ ఉన్నాడని ప్రీతమ్, పెడ్రో గుర్తిస్తారు. మార్టిన్ పోలీసులను తప్పుదోవ పట్టించడానికి డిజిటల్ ఆధారాలను మారుస్తూ, వాళ్ళకంటే ఒక అడుగు ముందే ఉంటాడు.

Advertisement

టెక్నాలజీపై ప్రీతమ్‌కు ఉన్న పట్టు, మానవ ప్రవర్తనను అంచనా వేయగల పెడ్రో పోలీస్ ఇన్స్టింక్ట్స్ (అనుభవం) రెండూ కలిస్తేనే మార్టిన్‌ను పట్టుకోవడం సాధ్యమవుతుంది. చివరకు వీరిద్దరూ కలిసి ఆ సైబర్ విలన్‌ను ఎలా పట్టుకున్నారు ? మంత్రి కొడుకును ఎలా రక్షించారు ? అన్నది సిరీస్ లో చూడాల్సిందే.

తెలుగులోనూ స్ట్రీమింగ్

‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ 6 ఎపిసోడ్ల ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ప్రస్తుతం JioHotstarలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. 2026 జూలై 3న ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్ ను రాజ్‌కుమార్ హిరానీ క్రియేట్ చేసి నిర్మించారు. అర్షద్ వార్సీ, వీర్ హిరానీ, విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలు పోషించారు.

Read Also: ఒకే అపార్ట్మెంట్లో చిక్కుకుపోయే జంట… కట్ చేస్తే స్పైన్ చిల్లింగ్ ట్విస్ట్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×