// // Prison Drama OTT : గత 32 సంవత్సరాలుగా చెక్కు చెదరని ఆదరణ -->
E-Paper
Advertisement

Prison Drama OTT : గత 32 సంవత్సరాలుగా చెక్కు చెదరని ఆదరణ.. ప్రపంచంలోనే బెస్ట్ మూవీగా గుర్తింపు… ఐయండిబిలో 9.3 రేటింగ్

Prison Drama OTT : గత 32 సంవత్సరాలుగా చెక్కు చెదరని ఆదరణ.. ప్రపంచంలోనే బెస్ట్ మూవీగా గుర్తింపు… ఐయండిబిలో 9.3 రేటింగ్
Advertisement

Prison Drama OTT : హాలీవుడ్ చరిత్రలోనే కాకుండా, ప్రపంచ సినీ చరిత్రలోనే ఒక అద్భుతమైన కళాఖండంగా నిలిచింది ఒక సినిమా. 1994లో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, కాలక్రమేణా కల్ట్ క్లాసిక్ గా ఎదిగింది. ప్రస్తుతం ఇది IMDbలో 9.3 రేటింగ్‌తో ప్రపంచంలోనే నంబర్ వన్ సినిమాగా కొనసాగుతోంది. థియేటర్లలో విడుదలైనప్పుడు ఫ్లాప్ అయినప్పటికీ, కేబుల్ టీవీ ప్రసారాల ద్వారా ఇది అద్భుతమైన ఆదరణ పొందింది. రెండు దశాబ్దాలకు పైగా జైలులో ఒక వ్యక్తి సాగించిన జీవితమే పోరాటమే ఈ సినిమా కథ. ఇప్పటి వరకు ఈ సినిమాను ఎవరైనా చూడకపోతే, ఈ వీకెండ్ ఓ లుక్ వేయండి.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

1994లో విడుదలైన ఈ అద్భుతమైన అమెరికన్ డ్రామా మూవీ పేరు ‘ది షాషాంక్ రిడంప్షన్’ (The Shawshank Redemption). ఇది స్టీఫెన్ కింగ్ రాసిన ‘రిటా హేవర్త్ అండ్ షాషాంక్ రిడంప్షన్’ అనే నవల ఆధారంగా తెరకెక్కింది. ఫ్రాంక్ దారాబంత్ దర్శకత్వంలో టిమ్ రాబిన్స్ (ఆండీ డ్యూఫ్రేన్), మోర్గాన్ ఫ్రీమాన్ (రెడ్) అద్భుతమైన నటనను ప్రదర్శించారు ఇందులో. ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ చిత్రంగా ఐయండిబి 9.3/10 రేటింగ్‌తో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈ చిత్రం 7 ఆస్కార్ అవార్డులకు కూడా నామినేట్ అయ్యింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఆండీ అనే బ్యాంకర్ తాను చేయని నేరానికి జైలుకు వెళ్తాడు. తన భార్యను, ఆమె ప్రియుడిని హత్య చేశాడనే తప్పుడు ఆరోపణతో ఆండీకి 1947లో రెండు జీవితకాలాల పాటు జైలు శిక్ష పడుతుంది. అక్కడ అందరిలా ఏడవకుండా, చాలా కూల్‌గా ఉంటూ తన పని తాను చేసుకుంటాడు ఇతగాడు. అక్కడ జైలులో రెడ్ అనే వ్యక్తితో ఆండీకి మంచి దోస్తీ కూడా కుదురుతుంది. ఇక తన తెలివితేటలతో జైలు వార్డెన్ చేసే అవినీతి సొమ్ముకు లెక్కలు రాస్తూ, అందరి నమ్మకాన్ని గెలుచుకుంటాడు. అయితే తాను నిర్దోషి అని నిరూపించుకునే అవకాశం వచ్చినా వార్డెన్ దాన్ని అడ్డుకోవడంతో, ఆండీకి చట్టం మీద ఉన్న ఆశ కూడా పోతుంది.

కానీ ఆండీ అంత సులభంగా ఓటమిని ఒప్పుకొడు. ఎవరికీ తెలియకుండా ఏకంగా 19 ఏళ్ల పాటు తన గది గోడకు కన్నం తవ్వి, ఒక రాత్రి మురికి కాలువలో దూకి జైలు నుండి భయంకరమైన రీతిలో తప్పించుకుంటాడు. వెళ్తూ వెళ్తూ వార్డెన్ అక్రమ సంపాదనను కొట్టేయడమే కాకుండా, అతని పాపాల చిట్టాను పోలీసులకు పంపిస్తాడు. చివరికి ఆండీ, తన స్నేహితుడు రెడ్ ఇద్దరూ సముద్ర తీరంలో కలుసుకోవడంతో కథ ముగుస్తుంది.

Advertisement

Read Also : 40 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శనలు… అనేక అవార్డులు గెలుచుకున్న ఈ క్రేజీ మూవీ చూశారా?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×