// // Thriller Movie OTT : చావు భయంతో వణికిపోయే డ్యాన్సర్లు... -->
E-Paper
Advertisement

Thriller Movie OTT : చావు భయంతో వణికిపోయే డ్యాన్సర్లు… అవంతిక వందనపు నటించిన హాలీవుడ్ థ్రిల్లర్ ఓటీటీలోకి… ఎక్కడ చూడచ్చు అంటే

Thriller Movie OTT : చావు భయంతో వణికిపోయే డ్యాన్సర్లు… అవంతిక వందనపు నటించిన హాలీవుడ్ థ్రిల్లర్ ఓటీటీలోకి… ఎక్కడ చూడచ్చు అంటే
Advertisement

Thriller Movie OTT : ఓటీటీలోకి ఒక హాలీవుడ్ మూవీ నేరుగా స్ట్రీమింగ్ కి వస్తోంది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అవంతిక వందనపు ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. మన తెలుగు అమ్మాయి హాలీవుడ్‌లో ఇలాంటి క్రేజీ యాక్షన్ థ్రిల్లర్‌లో నటించడం విశేషం. ఇక ‘కిల్ బిల్’ వంటి సినిమాలతో యాక్షన్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న ఉమా థర్మన్ ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఆమె యాక్టింగ్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ కూడా. ఇది ఒక డ్యాన్స్ పోటీకి వెళ్తున్న ఐదుగురు ప్రొఫెషనల్ బాలే డ్యాన్సర్ల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళంతా ఒక అడవిలో ఉన్న వింత హోటల్ లో చిక్కుకోవడంతో అసలు కథ ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ హంగేరీలోని బుడాపెస్ట్ పరిసరాల్లో జరిగింది. అక్కడి దట్టమైన అడవులు, పాతకాలపు కట్టడాలు సినిమాలోని భయానక వాతావరణాన్ని పీక్స్‌కి తీసుకెళ్లాయి.

ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్

ఈ థ్రిల్లర్ మూవీ పేరు ‘ప్రెట్టీ లీతల్’ (Pretty Lethal). ఈ చిత్రం థియేటర్లలో విడుదలయ్యే అవకాశం లేదు. అయితే 2026 మార్చి 13న జరిగిన SXSW ఫిల్మ్ ఫెస్టివల్‌లో దీనికి సంబంధించి ప్రత్యేక ప్రదర్శనలు జరిగాయి. అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్ ఈ సినిమాను నేరుగా తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియో (Prime Video) లోనే విడుదల చేస్తోంది. ఇది ప్రేక్షకులకు మార్చి 25 నుండి ప్రైమ్ వీడియోలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఐదుగురు బాలే డ్యాన్సర్ల టీమ్ అదిరిపోయే డ్యాన్స్ కాంపిటీషన్ కోసం బస్సు ప్రయాణం మొదలు పెడతారు. కానీ దారి మధ్యలో ఒక అడవి దగ్గర వాళ్ల బస్సు ట్రబుల్ ఇచ్చి ఆగిపోతుంది. సహాయం కోసం ఎదురుచూస్తున్నప్పుడు, అడవిలో ఒక పాతకాలపు రోడ్‌సైడ్ హోటల్ కనిపిస్తుంది. ఆ హోటల్ యజమాని ఒకప్పుడు పెద్ద డ్యాన్సర్ అని వాళ్ళకు తెలుస్తుంది. దీంతో వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ కథ నడిచే కొద్ది, ఇప్పుడు ఆమెలో ఏదో తెలియని క్రూరత్వం ఉందని వాళ్లకి మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఆ హోటల్ లోపల అడుగుపెట్టినప్పటి నుండి వాళ్లకి చావు భయం మొదలవుతుంది.

ఆ హోటల్ బయట గడ్డకట్టే చలి, లోపల ఏమో గడ్డపారల్లాంటి ఆయుధాలతో సైకో ముసలామె. అమ్మాయిలను గదిలో బంధించి, వాళ్లతో పిచ్చి ఆటలు ఆడిస్తుంది ఆమె. ఇక లాభం లేదనుకున్న ఆ ఐదుగురు డ్యాన్సర్లు, అక్కడ ఉన్న వింత మనుషుల నుండి తప్పించుకోవడానికి నడుం బిగిస్తారు. ఈ అమ్మాయిలు తమ డ్యాన్స్ విద్యనే ఆయుధంగా మలుచుకుంటారు. ఈ క్లైమాక్స్ లో ఫైట్స్ కూడా చాలా క్రేజీగా ఉంటాయి. చివరికి వీళ్ళంతా ఆ హోటల్ నుంచి బయట పడతారా ? ఆ హోటల్ లో ఎందుకు వీళ్ళను వేధించారు ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  మాఫియా లీడర్ గా మారే గూఢచారి… వెంట పడే డిటెక్టివ్… కేక పెట్టిస్తున్న కొరియన్ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×