E-Paper
Advertisement

OTT Movie : యాంకర్ శ్రీముఖి హీరోయిన్ గా నటించిన ఒకే ఒక్క సినిమా ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : యాంకర్ శ్రీముఖి హీరోయిన్ గా నటించిన ఒకే ఒక్క సినిమా ఏ ఓటీటీలో ఉందో తెలుసా?
Advertisement

OTT Movie : యాంకర్ గా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీముఖి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె హీరోయిన్ గా నటించిన ఒకే ఒక్క సినిమా ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.

శ్రీముఖి హీరోయిన్ గా నటించిన ఫస్ట్ మూవీ

Advertisement

శ్రీముఖి 2013 లో వచ్చిన ‘ప్రేమ ఇష్క్ కాదల్’ (Prema Ishq Kaadhal) అనే తెలుగు రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. దీనికి పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీని యూట్యూబ్ (Youtube) లో ఫ్రీగానే చూడవచ్చు. ఇక ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే… అర్జున్ ఒక FM రేడియోలో జాకీగా పని చేస్తుంటాడు. ఇతను ప్లే బాయ్ లా లైఫ్ ని గడుపుతుంటాడు. ఒకరోజు శాంతి (శ్రీముఖి) అనే అమ్మాయిని చూస్తాడు. ఆమె అందానికి పిచ్చెక్కి, తనని ఎలాగైనా పొందాలని అనుకుంటాడు. ఆమెతో పరిచయం పెంచుకుని, సమయం గడుపుతుంటాడు. కానీ శాంతి తన కెరీర్ కోసం బాస్‌తో క్లోజ్ గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక పార్టీలో శాంతి తన బాస్ తో మధ్యపానం సేవించి సన్నిహితంగా గడుపుతుంది. ఈ విషయం అర్జున్ కి తెలిసిపోతుంది.

అయితే శాంతి దాన్ని కేవలం ప్రమోషన్ కోసం చేశానని సర్దిచెప్పుకుంటుంది. అర్జున్‌ ను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. నిజానికి అర్జున్ తన ప్లేబాయ్ ఇమేజ్‌ ను పక్కన పెట్టి, ఆమెపై నిజమైన ప్రేమను పెంచుకుంటాడు. చివరికి అర్జున్ ని శాంతి ప్రేమిస్తుందా ? లేదంటే తన కోసం తాను బతుకుతుందా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోండి. ఈ సినిమాలో ఇంకా రెండు వేరు వేరు స్టోరీలు ఉంటాయి. అవి కూడా మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్లే. ఇక ఈ మూవీ తరువాత శ్రీముఖి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అలాగే గెస్ట్ రోల్స్ కూడా పోషించింది. ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే, యాంకరింగ్ తో దుమ్మురేపుతోంది శ్రీముఖి.  మరి ఆమె నటించిన సినిమాలు ఏంటి? అవి ఇప్పుడు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

Advertisement

శ్రీముఖి నటించిన సినిమాలు – వాటి ఓటీటీలు
1. జులాయి – అమెజాన్ ప్రైమ్ వీడియో
2. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ – హాట్‌స్టార్
3. బాబు బాగా బిజీ – ప్రైమ్ వీడియో
4. నేను శైలజ – సన్ నెక్స్ట్
5. క్రేజీ అంకుల్స్ – ఆహా
6. మాస్ట్రో – హాట్ స్టార్
7. భోళా శంకర్ – నెట్ ఫ్లిక్స్

Read Also : ఈ మూవీ చూశాక మాల్ లో పొరపాటున కూడా డ్రెస్ ట్రయల్స్ వేయరు… ట్విస్ట్ లతో అదిరిపోయే మలయాళ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×