E-Paper
Advertisement

ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ ‘Lik’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ప్రదీప్ రంగనాథన్ ‘Lik’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Advertisement

Lik Movie OTT: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ఇటీవల సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఈయన విగ్నేష్ శివన్(Vignesh Shivan) దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIk) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ప్రదీప్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

ఇలా థియేటర్లలో పరవాలేదు అనిపించుకున్న ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి అమెజాన్ ప్రైమ్ అధికారకంగా వెల్లడించారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఆమెజాన్ ప్రైమ్ వీడియోస్(Amazon Prime Videos) తాజాగా ఈ సినిమా మే ఆరవ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుందని తెలియజేశారు. మరి థియేటర్లలో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతూ ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ గా..

Advertisement

ఇక ఈ సినిమాలకు నయనతార నిర్మాతగా వహించగా ఆమె భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథ్ కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటించారు. 2040 సంవత్సరంలో జరగబోయే లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే..

Advertisement

2040 సంవత్సరంలో జరిగిపోయి ప్రేమకథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ ఫెయిల్యూర్ కు బీమా కల్పించే రోజులలో యువత బలహీనతను వాడుకొని లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేస్తారు సూర్య (ఎస్ జె సూర్య). మొబైల్ యాప్ ద్వారా యువతి యువకులు పరిచయాలు ఏర్పరచుకొని ఇష్టమైతే పెళ్లి వైపు అడుగులు వేసే దిశగా ఈ కంపెనీ వ్యవహరిస్తుంది అయితే సోషల్ మీడియాకు బానిసగా ఉన్న ధీమా(కృతి శెట్టి) కూడా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి పార్ట్నర్ కోసం వెతుకుతుంటుంది. ఇలాంటి సమయంలోనే సెల్ఫోన్ ని ఉపయోగించని వాసు ధీమాని చూసిన తొలి చూపులోనే తనతో ప్రేమలో పడతాడు. ఇలా ఈమె ప్రేమలో పడిన వాసు ఫోన్ కొనుక్కొని అతను కూడా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ని సబ్స్క్రైబ్ చేసుకొని తనని ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తారు. మరి వాసు ధీమా ప్రేమను దక్కించుకున్నారా? వీరి ప్రేమలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాసుకి నెగిటివ్ స్కోర్ రావడానికి గల కారణం ఎవరు? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Also Read: మీకు ఇదేగతి పడుతుంది.. వెయ్యిరెట్లు అనుభవిస్తారు.. వైసీపీ నేతపై యాంకర్ ఫైర్?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×