E-Paper
Advertisement

ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్ ఫ్లాప్ మూవీ!

ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్ ఫ్లాప్ మూవీ!
Advertisement

Prabhas:పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ఆరంభంలో నటించిన తొలి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ మూవీ ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ , రిద్దీ కుమార్ హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ఆడియన్స్ ఆశించిన అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి ఆటతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలతో డిసాస్టర్‌గా నిలిచింది. అయితే థియేటర్లలో చుక్కలు చూసిన ఈ సినిమా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో మాత్రం ఊహించని రేంజ్‌లో ఊచకోత కోస్తోంది. ఓటీటీ వేదికపై రికార్డుల రచ్చ లేపుతూ, ఈ ఏడాది అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ ఇండియన్ సినిమాగా నంబర్ వన్ స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

థియేటర్లలో ఫ్లాప్.. డిజిటల్‌లో టాప్:

‘ది రాజా సాబ్’ సినిమా బాక్సాఫీస్ రన్‌లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినప్పటికీ, భారీ బిజినెస్ జరగడం వల్ల బయ్యర్లకు పెద్ద మొత్తంలో నష్టాలను మిగిల్చింది. కానీ ఓటీటీ రిలీజ్ తర్వాత సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ప్రముఖ డిజిటల్ సంస్థ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం, థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్‌ను భారీగా ఆకట్టుకుంటోంది. ఇక సినిమా ఫ్లాప్ అయినా డిజిటల్ వరల్డ్‌లో ఈ రేంజ్ వ్యూవర్ షిప్ రావడం నిజంగా ప్రభాస్ కటౌట్‌కు ఉన్న పవరే కారణం.

ఒర్మాక్స్ రిపోర్ట్‌లో నంబర్ వన్ ర్యాంప్:

Advertisement

ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఒర్మాక్స్ స్ట్రీమ్ వ్యూ’ తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుండి జూన్ మధ్య కాలంలో అత్యధిక మంది వీక్షించిన ఏకైక సౌత్ ఇండియన్ చిత్రంగా ‘ది రాజా సాబ్’ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక హాట్‌స్టార్‌లో ఏకంగా 17.5 మిలియన్ల వ్యూస్ సాధించి ప్రభాస్ డిజిటల్ మార్కెట్ స్టామినా ఏంటో నిరూపించారు. ఇయర్ స్టార్టింగ్‌లోనే ఓటీటీలోకి రావడం కూడా ఈ సినిమాకు వ్యూస్ పరంగా బాగా ప్లస్ అయింది.

also read:నిర్మాతలకు భారీ షాక్ ఇస్తున్న భాగ్యశ్రీ.. మూల్యం చెల్లించుకోవాల్సిందేనా?

సాలిడ్ మార్జిన్‌తో మిగతా సినిమాలకు చెక్:

Advertisement

రెండో స్థానంలో ఉన్న మలయాళ చిత్రం ‘ధృడం’ కేవలం 8.5 మిలియన్ వ్యూస్‌తో ఉండగా, దానికి రెట్టింపు కంటే ఎక్కువ మార్జిన్‌తో ‘రాజా సాబ్’ అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ఇక సౌత్ లోని అన్ని పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి ఒక ఫ్లాప్ సినిమా ఇంత పెద్ద సంచలనం సృష్టించడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

థియేటర్లలో ఫలితం ఎలా ఉన్నా, ఇంట్లో కూర్చుని చూసే ఓటీటీ ఆడియన్స్‌కు మాత్రం ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ తెగ నచ్చేసింది. కేవలం తన స్టార్ పవర్‌తో డిజిటల్ స్క్రీన్స్‌ను రూల్ చేసిన ప్రభాస్.. ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 3న రాబోతున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’తో థియేటర్లలో ఎలాంటి దండయాత్ర చేస్తాడో చూడాలి. ‘రాజా సాబ్’ సృష్టించిన ఈ ఓటీటీ రికార్డులు రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు సరికొత్త జోష్ ఇస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×