// // Political Thriller OTT : దేశం కోసం ప్రాణాలకు తెగించే టీచర్ .. -->
E-Paper
Advertisement

Political Thriller OTT : దేశం కోసం ప్రాణాలకు తెగించే టీచర్ … యూత్ చూడాల్సిన పొలిటికల్ థ్రిల్లర్

Political Thriller OTT : దేశం కోసం ప్రాణాలకు తెగించే టీచర్ … యూత్ చూడాల్సిన పొలిటికల్ థ్రిల్లర్
Advertisement

Political Thriller OTT : ఎలక్షన్లు వచ్చాయంటే పరిస్థితి మామూలుగా ఉండదు. ప్రచారాలు, హంగామాలు, ఆర్భాటాలు, ఓట్లకు డబ్బులు ఇదంతా ఒక రణరంగంలో సాగుతూ ఉంటుంది. అయితే ఓటింగ్ అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లను భద్రపరచడం కూడా కత్తి మీద సామే. ఇక ఈ నేపథ్యంలో ఒక మూవీ అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేసింది. గెలవడానికి ఎంత దాకా అయినా వెళ్లే నరరూప రాక్షసుల మధ్య ఒక టీచర్ చిక్కుకుంటుంది. అక్కడ బ్యాలెట్ బాక్స్ ను ఆ దుర్మార్గుల చేతికి చిక్కకుండా కాపాడే ప్రయత్నంలో ఈ స్టోరీ సాగుతుంది. ఇక ఎన్నికల సమయంలో టీచర్లు పడే కష్టాలను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ ఫిలిప్పీన్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘బలోటా’ (Balota). 2024లో వచ్చిన ఈ సినిమాకు కిప్ ఓబండా దర్శకత్వం వహించారు. ప్రముఖ ఫిలిప్పీన్ నటి మరియన్ రివెరా, ఈ చిత్రంలో టీచర్ ఎమ్మీ పాత్రలో నటించారు. ఈమె నటనకు గాను సినిమలయా (Cinemalaya) ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డు లభించింది. ఇది ఆగస్టు 2024లో ఫిలిప్పీన్స్‌లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా ఒక చిన్న ఊరిలో జరిగే లోకల్ ఎలక్షన్ల చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు రాజకీయ నాయకులు మేయర్ సీటు కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఆ ఊర్లో ఓట్లు వేయడం అంటే సామాన్యమైన విషయం కాదు, అంతా రౌడీయిజం, పైసల పంపిణీ, వెన్నుపోట్లు నడుస్తుంటాయి. సరిగ్గా ఓట్ల లెక్కింపు టైమ్‌లో గొడవ ముదిరిపోయి, ఒక వర్గం వాళ్లు బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లడానికి ప్లాన్ చేస్తారు. ఈ గొడవ మధ్యలో టీచర్ ఎమ్మీ చిక్కుకుపోతుంది. తను ఎలక్షన్ డ్యూటీలో ఉన్న సిన్సియర్ టీచర్. బ్యాలెట్ బాక్సును దొంగలించకుండా కాపాడాలని ఎమ్మీ డిసైడ్ అవుతుంది.

ఇక ఆ బాక్సును పట్టుకుని ప్రాణాలకు తెగించి అడవిలోకి పారిపోతుంది. వెనకాల రౌడీలు, రాజకీయ నాయకుల మనుషులు తుపాకులతో వేటాడుతుంటే, ఒంటరిగా ఆ బాక్సును రక్షించడానికి ఆమె చేసే పోరాటం చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అడవిలో తలదాచుకుంటూ, ఆకలితో అలమటిస్తూ, చుట్టూ ఉన్న ప్రమాదాలను తప్పించుకుంటూ ఎమ్మీ సాగించే ప్రయాణమే ఈ సినిమా. కేవలం బాక్సును కాపాడటమే కాదు, అసలైన ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఒక ఓటు విలువ ఎంత? అనేది ఈ సినిమాలో పచ్చిగా, నాటుగా చూపించారు.

Advertisement

Read Also : అనుపమ పరమేశ్వరన్ తమిళ సర్వైవల్ థ్రిల్లర్ నెల రోజుల తర్వాత ఓటీటీలోకి… తెలుగులోనూ చూడచ్చు

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×