E-Paper
Advertisement

OTT Movie : భర్త గదిలోకి పనిమనిషిని పంపే భార్య… బట్టలిప్పి తరిమికొట్టే ఊరి జనం

OTT Movie : భర్త గదిలోకి పనిమనిషిని పంపే భార్య… బట్టలిప్పి తరిమికొట్టే ఊరి జనం
Advertisement

OTT Movie : నాగరిక ప్రపంచంలో అనాగరికంగా ప్రవర్తించే మనుషుల వల్ల, అమాయకుల జీవితాలు నాశనం అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ నాగాలాండ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. మంత్రాలు చేస్తుందనే కారణంగా ఒక మహిళను వివస్త్రను చేసి ఊరి మధ్యలో నడిపించి తరిమేస్తారు. ఈ స్టోరీ కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

యూట్యూబ్ (Youtube) లో

Advertisement

ఈ మూవీ పేరు ‘ఫుల్మానియా’ (Phulmania). ఈ మూవీకి లాల్ విజయ్ షాదేయో దర్శకత్వం వహించారు. దీనిని లాల్ విజయ్ షాదేయో, నీతూ అగర్వాల్, అమృతా షాదేయో నిర్మించారు. ఈ మూవీలో కోమల్ సింగ్ కథానాయికగా నటించింది. ఈ మూవీ జార్ఖండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ లోనూ,  ఫ్రాన్స్‌లో జరిగిన 72వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించబడింది. జియో టివి (Jio TV), యూట్యూబ్ (Youtube) లలో ఈ మూవీ   స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

రాజు, మణి ఒక పల్లెటూరిలో ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటారు. రాజు, మణి తో ప్రేమలో పడతాడు. అయితే ఈ విషయం తనలోనే దాచుకుంటాడు. ఒకరోజు పెళ్లిలో పెళ్లికూతురు భర్తతో పాటు వెళ్లిపోతుంది. ఇది చూసి పెళ్లి అయితే మణి కూడా వదిలి వెళ్ళిపోతుందని అనుకుంటాడు. సిటీకి వెళ్లి డబ్బులు సంపాదించి మణిని పెళ్లిచేసుకోవాలనుకుంటాడు. అనుకున్నట్టుగానే సిటీకి వెళ్ళిపోతాడు. కొద్దిరోజుల తర్వాత తిరిగి వచ్చిన రాజుకి ఒక విషయం తెలిసి షాక్ అవుతాడు. అప్పుడే మణి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇతడు బాధపడే సమయంలోనే పెళ్లి కూడా అయిపోతుంది. ఆ తర్వాత అత్తారింటికి వెళ్లిన మణికి చుక్కలు కనపడతాయి. ఆమె అడుగు పెట్టిన వేల ఆ ఊరిలో వర్షాలు కూడా పడవు. భర్త కూడా ఒక ప్రమాదంలో చనిపోతాడు. ఆమెకు మంత్రాలు వస్తాయని అనుమానించి, ఆ ఊరి ప్రజలు దారుణంగా ప్రవర్తిస్తారు. వివస్త్రను చేసి ఊరి నుంచి తరిమేస్తారు. సిటీకి వెళ్లిన మణి ఒక ఇంట్లో పనిమనిషిగా చేరుతుంది. ఒక పేపర్ ప్రకటన చూసి ఆ ఇంటికి వెళ్తుంది.

సరోగసి ద్వారా పిల్లల్ని కంటే లక్ష రూపాయలు నగదు ఇస్తామని అందులో ఉంటుంది. అయితే ఆ పద్దతిలో పిల్లల్ని కనడానికి పెద్దలు ఒప్పుకోరు. అ ఇంట్లో నివసిస్తున్న జంటకి భార్య తరఫున సమస్య ఉంటుంది. అయితే ఇప్పుడు మణితో సమయం గడిపి పిల్లల్ని కనాలనుకుంటారు. ఈ క్రమంలో ఆ పనికి కూడా ఆమెను ఒప్పిస్తారు. అయితే మణిని భర్త గదిలోకి పంపాక భార్యకి అనుమానం వస్తుంది. ఆమెతో గడిపాక తనని దూరం పెడతాడేమో అని అనుకుంటుంది. మరోవైపు రాజు కూడా మణి కోసం వెతుక్కుంటూ సిటీకి వస్తాడు. చివరికి రాజు మణిని కనిపెడతాడా? ఈలోగా అతనితో మణి పిల్లల్ని కంటుందా? ఆమె జీవితం ఎలా తిరుగుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఫుల్మానియా’ (Phulmania) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×