E-Paper
Advertisement

అర్థరాత్రి అమ్మాయిపై మోజు పడే ఆత్మ… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టే ట్విస్ట్

అర్థరాత్రి అమ్మాయిపై మోజు పడే ఆత్మ… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టే ట్విస్ట్
Advertisement

Indonesian horror Movie : పెళ్లి అనేది ఇద్దరి జీవితాలను కలిపే బంధం. కొత్త కలలు, కొత్త ఆశలు, కొత్త జీవితం కానీ పెళ్లైన కొద్ది రోజులకే భర్త ప్రవర్తన విచిత్రంగా మారిపోతే? పగలంతా ఒకలా ఉండి, రాత్రి పడితే పూర్తిగా మరో మనిషిలా మారిపోతే? అంతకంటే భయంకరంగా, మీ పక్కన పడుకున్న వ్యక్తి నిజంగా మీ భర్తేనా అనే అనుమానం మొదలైతే? ఈ భయానకమైన ఆలోచన చుట్టూ తిరిగే మలేషియన్ సూపర్ నేచురల్ హారర్ చిత్రం పెంగాబ్డి సేతాన్ (Pengadi satan). 2017లో విడుదలైన ఈ సినిమా దక్షిణాసియా జానపద కథలు, దెయ్యాల పురాణాలు, కుటుంబ హారర్ అంశాలను కలిపి రూపొందించారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది.

నిజమా లేక భ్రమలా?

కథలో ఒక యువతి పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. మొదట్లో అన్నీ సవ్యంగానే సాగుతాయి. భర్త ప్రేమగా ఉంటాడు. కుటుంబం కూడా సంతోషంగా కనిపిస్తుంది. కానీ కొద్ది రోజుల తర్వాత ఆమె జీవితంలో వింత సంఘటనలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా అర్థరాత్రి తర్వాత జరిగే కొన్ని విషయాలు ఆమెను తీవ్రంగా కలవరపెడతాయి. భర్త ప్రవర్తనలో వచ్చే మార్పులు, ఇంట్లో వినిపించే విచిత్రమైన శబ్దాలు, కనిపించి మాయమయ్యే నీడలు ఆమెను భయపెట్టడం మొదలుపెడతాయి. తనకు కనిపిస్తున్నవి నిజమా లేక భ్రమలా అనే సందేహంలో పడిపోతుంది. కానీ ఒక్కో సంఘటన బయటపడుతున్న కొద్దీ ఆమె చుట్టూ ఉన్న ప్రపంచమే అబద్ధమై ఉండొచ్చని అర్థమవుతుంది.

Advertisement

సినిమా ముందుకు సాగే కొద్దీ ఇది కేవలం దెయ్యాల కథ కాదని తెలుస్తుంది. కోరికలు, మోహం, మోసం, చీకటి శక్తుల ప్రభావం వంటి అంశాలు కథలో కీలకంగా మారతాయి. ముఖ్యంగా ఒక ఆత్మ ఒక మహిళ జీవితంపై చూపే ప్రభావాన్ని దర్శకుడు భయానకంగా చూపించాడు. అయితే ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకునేది క్లైమాక్స్ గురించే. కథ మొత్తం ఒక దిశలో వెళ్తున్నట్టే అనిపించినా, చివరి మలుపు వచ్చేసరికి ప్రేక్షకుల అంచనాలు పూర్తిగా తలకిందులవుతాయి. అదే ఈ సినిమాను సాధారణ హారర్ చిత్రాల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతుంది.

Read Also : అతను అడుగు పెడితే అనుమానాస్పద మరణాలు… వింటేజ్ వ్యాంపైర్ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×