E-Paper
Advertisement

OTT Movie : అడ్డుగా వచ్చినోళ్లను అడ్డంగా వేసేసే ఆడ సైకో… కేక పెట్టించే సైకో థ్రిల్లర్

OTT Movie : అడ్డుగా వచ్చినోళ్లను అడ్డంగా వేసేసే ఆడ సైకో… కేక పెట్టించే సైకో థ్రిల్లర్
Advertisement

OTT Movie : హాలీవుడ్ నుంచి వచ్చే కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమాలు మూవీ లవర్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరోయిన్ కి డాన్స్ పిచ్చి ఉంటుంది. అందుకోసం ఆమె చేసే సైకో పనులు మామూలుగా ఉండవు. ఒకసారి నవ్వు తెప్పిస్తూ, ఒకసారి వణుకు పుట్టిస్తూ ఉండే, ఈ సినిమాను చూస్తే మూవీ లవర్స్ బాగా చిల్ అవుతారు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళ్తే…

జియో  సినిమా (Jio cinema) లో

Advertisement

ఈ హాలీవుడ్ సైకో థ్రిల్లర్ మూవీ పేరు ‘పెరల్‘ (Pearl). 2022 వచ్చిన ఈ మూవీకి టీ వెస్ట్ దర్శకత్వం వహించారు. ఇందులో డేవిడ్ కోర్న్స్‌వెట్, టాండి రైట్, మాథ్యూ సుందర్‌ల్యాండ్, ఎమ్మా జెంకిన్స్-పురో నటించారు. సెప్టెంబర్ 3, 2022న 79వ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో  ప్రీమియర్‌ను ప్రదర్శించి, యునైటెడ్ స్టేట్స్‌లోని థియేటర్‌లలో సెప్టెంబర్ 16, 2022న విడుదలైంది. ఈ మూవీ జియో  సినిమా (Jio cinema) లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

హీరోయిన్ తల్లి, తండ్రి తో అమెరికాలో ఒక పల్లెటూరు ప్రాంతంలో నివసిస్తుంది. ఈమె భర్త సోల్జర్ గా హిట్లర్ తరపున జర్మనీలో పోరాడుతుంటాడు. అయితే హీరోయిన్ తండ్రి అనారోగ్యం కారణంగా కుర్చీకే పరిమితం అవుతాడు. హీరోయిన్ కి ఆమె తల్లి చాలా కండిషన్స్ పెడుతూ ఉంటుంది. ఇంటిలో ఉండే ఫామ్ ని చూసుకోమని చెప్తుంది. అయితే హీరోయిన్ కి డ్యాన్స్ అంటే చాలా పిచ్చి. ఇంట్లో తెలియకుండా సినిమాలను కూడా థియేటర్ కి వెళ్లి చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో హీరోయిన్ కి ఓక డైరెక్టర్ పరిచయం అవుతాడు. నువ్వు గొప్ప డాన్సర్ అవుతావు అంటూ పొగుడుతాడు. ఈ మాటలకి హీరోయిన్ చాలా ఆనందపడుతుంది. ఆ తర్వాత తన భర్త చెల్లెలు ఇంటికి రావడంతో హీరోయిన్ ఎంతో  సంతోషపడుతుంది. డాన్స్ కాంపిటీషన్ ఉందని చెబుతూ, ఆమెకు అడ్రస్ కూడా ఇచ్చి వెళ్తుంది. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తానని తల్లికి చెప్తుంది హీరోయిన్. అయితే తల్లి ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఆమెను గట్టిగా కొట్టి ఒకచోట బంధిస్తుంది.

ఆ తర్వాత హీరోయిన్ డాన్స్ ఆడిషన్ కి వెళ్తుంది. అందులో ఆమె సరిగ్గా డాన్స్ చేయకపోవడంతో తిరిగి వెనక్కి పంపిస్తారు. ఈ క్రమంలో హీరోయిన్ ఇంటికి వచ్చిన డైరెక్టర్ కి అక్కడ అనుమాన పరిస్థితులు కనబడతాయి. ఇంతలోనే హీరోయిన్ ఆ డైరెక్టర్ ని చంపేస్తుంది. ఆ తర్వాత ఇంటి లోపల ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్లి ఆమెను కూడా చంపేస్తుంది. తన తండ్రి కుర్చీకే పరిమితమైనా కూడా, ఈమెకు ఏమొచ్చిందో గాని అతనిని కూడా చంపేస్తుంది. ఆ తర్వాత ఆ శవాలతో కలిసి భోజనం చేస్తుండగా, అక్కడికి తన భర్త చెల్లెలు వస్తుంది. ఆమె డాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యానని చెప్తుంది. ఆ కోపంతో ఆమెను కూడా అక్కడ చంపేస్తుంది. ఆ తర్వాత అక్కడికి, మిలటరీ నుంచి తన భర్త వస్తాడు. చివరికి హీరోయిన్ చేతిలో భర్త కూడా చనిపోతాడా? ఈ విషయం తెలియాలంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×