E-Paper
Advertisement

OG OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ఓజీ… ఎప్పుడంటే!

OG OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ఓజీ… ఎప్పుడంటే!
Advertisement

OG OTT: సినీ నటుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన తాజా చిత్రం “ఓజి”(OG). ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ సినిమాని అందుకొని చాలా కాలం అయింది. ఇలాంటి తరుణంలోనే ఓజి అంటూ పవర్ ఫుల్ యాక్షన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.

తుఫాన్ తిరిగి వచ్చేస్తోంది..

ఇలా థియేటర్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కుల ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Net Flix) వారు భారీ ధరలకు కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే తిరిగి ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాని అక్టోబర్ 23వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో చూసే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ గురించి నెట్ ఫ్లిక్స్ అధికారికంగా తెలియజేస్తూ ఒకానొక సమయంలో ముంబైలో తుఫాన్ ఉండేది.. ఇప్పుడు తిరిగి తుఫాన్ వచ్చేస్తోంది అంటూ ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ గురించి వెల్లడించారు.

ఓటీటీలో అడుగు పెట్టబోతున్న ఓజీ…

Advertisement

ఇలా థియేటర్లలో వెండితెరపై అద్భుతం సృష్టించిన ఈ సినిమా తిరిగి ఓటీటీలో రాబోతోందనే విషయం తెలియగానే అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ లో బీభత్సమైన క్రేజ్ లభించిన సంగతి తెలిసిందే. మరి వెండితెరపై అద్భుతాలు సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుజిత్(Sujeeth) దర్శకత్వం వహించగా పవన్ కళ్యాణ్ కు జోడిగా ప్రియాంక ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan)నటించారు.

Advertisement

ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియ రెడ్డి వంటి తదితరులు కూడా కీలక పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ బిగ్ అప్డేట్ కూడా వెల్లడించారు ఓ.జి యూనివర్స్ నుంచి మరికొన్ని సినిమాలు రాబోతున్నాయని, త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ తో పాటు ప్రీక్వెల్ సినిమాల షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలియజేశారు. ప్రస్తుతం దర్శకుడు సుజీత్ హీరో నానితో కలిసి బ్లడీ రోమియో అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతోంది. ఈ సినిమా పనులు పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ ఓజి సీక్వెల్ పనులలో సుజిత్ బిజీ కాబోతున్నారు.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×