// // OG OTT - నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తున్న ఓజీ.. -->
E-Paper
Advertisement

OG OTT: నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తున్న ఓజీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

OG OTT: నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తున్న ఓజీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!
Advertisement

OG Movie OTT Release Details: మొన్నటి వరకు ఓజీ ఫీవర్‌ మామూలుగా లేదు. సెప్టెంబర్‌ 25 ముందు ఎక్కడ చూసిన ఓజీ ఓజీ అంటూ ఫ్యాన్స్‌ అంత హంగామా చేసింది. ఇక సోషల్ మీడియా మొత్తం ఓజీ పోస్టర్సే. అంత హైప్‌ క్రియేట్‌ చేసింది ఈ సినిమా. సుజీత్‌ దర్శకత్వంలో, పవన్‌ కళ్యాణ్‌ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 25న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దూకుడు చూపిస్తోంది. ఇప్పటికీ బాక్సాఫీసు రికార్డుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లల్లోనే ఈ చిత్రం రూ. 250 పైగా కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసి రికార్డు బ్రేక్‌ చేసింది. ఇక పదకొండు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా ఓజీ రూ. 308 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.

ఈ ఏడాది హయ్యేస్ట్‌ గ్రాసర్‌..

Advertisement

అంతేకాదు ఈ ఏడాది హయ్యేస్ట్‌ గ్రాస్‌ సాధించిన తొలి తెలుగు సినిమాగా ఓజీ అరుదైన ఘనత సాధించిందంటూ మూవీ టీం తాజాగా ప్రకటించింది. అయితే ఇదంత బయటకు కనిపించేది మాత్రమే అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. ఈ సినిమా కలెక్షన్స్‌ టాక్‌కి భిన్నంగా ఉన్నాయని, మూవీ చెబుతున్నంత హైప్‌, బజ్‌ థియేటర్లలో కనిపించడం లేదంటూ యాంటి ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నాయి. ఫ్యాన్స్‌ విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఓ వర్గం ఆడియన్స్‌ పెద్దగా మెప్పించలేదని టాక్‌. హిట్‌ టాక్‌ వచ్చినా.. సినిమాలో పెద్దగా కథ లేదని, ఓజీని డైరెక్షన్‌ పెద్దగా ఆకట్టుకోలేదు అంటున్నారు. ఈ సినిమా పవన్‌ నటన, తమన్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ మాత్రమే నిలబెట్టిందనేది యాంటి ఫ్యాన్స్‌ వాదన. ఏదేమైనా.. పవన్‌ కెరీర్‌ మాత్రం హయ్యేస్ట్ గ్రాస్‌ మూవీ పడింది. ఈ విషయంలో మెగా, పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్‌ హ్యాపీ.

నెల రోజుల్లోనే

ప్రస్తుతం థియేటర్లలలో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కి సంబంధించిన తాజాగా ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన ఈ చిత్రం నెల రోజులోపే ఓటీటీకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇందుకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. ఓజీ మూవీ ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు చేస్తుంది. విడుదలై రెండు వారాలు అవుతున్న వసూళ్లు మాత్రం బాగానే రాబడుతుంది. పదకొండు రోజుల్లో ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌ గా రూ. 308 కోట్లకు పైగా కలెక్షన్స్‌ చేసింది. భారీ విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడెప్పుడు వస్తుందా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌ కోసం ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఈ దీపావళి కానుకగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుందట.

Advertisement

Also Read: OG Collections: OG అరుదైన రికార్డు.. 11 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే!

మేకర్స్‌ తో చర్చలు..

కాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మూవీకి వస్తున్న హైప్‌ చూసి విడుదలకు ముందే ఓజీ ఓటీటీ ఢీల్‌ క్లోజ్ అయ్యింది. నిజానికి ఒప్పందం ప్రకారం ఈ సినిమా రెండు నెలల తర్వాతే ఓటీటీకి రావాలి. కానీ, ఓజీ మూవీ థియేట్రికల్‌ మెల్లి మెల్లిగా డౌన్‌ అవుతుంది. తొలి రోజు భారీ ఓపెనింగ్స్‌ ఇచ్చిన ఈ చిత్రం కలెక్షన్స్‌ రెండో రోజుకే భారీగా పడిపోయాయి. అయితే ఇప్పుడు కాంతార: చాప్టర్‌ 1 కూడా విడుదల కావడంతో ఓజీ కలెక్షన్స్‌లో డ్రాప్‌ కనిపించింది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ ఇంకాస్తా ముందుకు తీసుకువచ్చారట మేకర్స్‌. దీపావళి పండుగా సందర్బంగా ఓజీ చిత్రాన్ని డిజిటల్‌ ప్రీమియర్‌ కి ఇవ్వాలని నెటిఫ్లిక్స్‌ భావిస్తోందట. దీనిపై ప్రస్తుతం మూవీ మేకర్స్‌ చర్చలు జరుగుతున్నాయట. అంత ఒకే అయితే అక్టోబర్‌ 23 నుంచి OG చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ రానుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×