E-Paper
Advertisement

Parasakthi OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన ‘పరాశక్తి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Parasakthi OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన ‘పరాశక్తి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Advertisement

Parasakthi OTT : తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) ఇటీవల సుధా కొంగర (Sudha Kongara)దర్శకత్వంలో పరాశక్తి సినిమా (Parasakthi)ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా జనవరి 10వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే. శ్రీ లీల శివ కార్తికేయన్ హీరో హీరోయిన్లుగా నటించిన భారీ పీరియాడికల్ పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా ఎన్నో అవంతరాలను దాటుకుంటూ విజయవంతంగా విడుదల అయింది. ఇక ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి దాదాపు నెలరోజులు అవుతున్న నేపథ్యంలో తిరిగి ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయటానికి చిత్ర బృందం సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడైంది.

ఫిబ్రవరి 7 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్..

పరాశక్తి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ జీ 5 (Zee 5)భారీ ధరలకు కైవసం చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన తెలియజేస్తూ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ సినిమా జీ 5 లో ప్రసారం కాబోతుందని అధికారికంగా వెల్లడించారు. అయితే ఈ సినిమా తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్ అయినవారు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జీ 5 లో ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.

హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యం..

Advertisement

ఇక ఈ సినిమా విషయానికి వస్తే..1960ల నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా హిందీ వ్యతిరేకత ఉద్యమం నేపథ్యంలో రావడంతో సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ సినిమా ఈ అడ్డంకులను దాటుకొని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో జయం రవి (Jayam Ravi)విలన్ పాత్రలో నటించగా.అథర్వ మురళి కీలక పాత్రలో కనిపించారు.

పరాశక్తి శ్రీ లీలకు తమిళ డెబ్యూ..

Advertisement

ఈ సినిమా ద్వారా నటి శ్రీ లీల తమిళ చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగు పెట్టారు. ఈ సినిమా ద్వారా ఫర్వాలేదనిపించుకున్న ఈమె ప్రస్తుతం తమిళంలో మరికొన్ని సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.శివ కార్తికేయన్ సుధా కొంగర కాంబినేషన్లో అంటేనే సినిమా పట్ల మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమాపై నెగెటివిటీ ప్రచారం చేయడంతో ఆ ప్రభావం కలెక్షన్ల పై చూపించిందని చెప్పాలి. ఇక శివ కార్తికేయన్ కూడా ఇటీవల విభిన్నమైన సినిమా కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంటున్నారు.

Also  Read: Allu Shirish: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. దుబాయ్ లో ఘనంగా బ్యాచిలర్ పార్టీ!

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×