E-Paper
Advertisement

OTT Movie : అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి…. భార్యాభర్తకు పీడకలలా మారే ట్రిప్… క్రేజీ మలయాళ సస్పెన్స్ థ్రిలర్

OTT Movie : అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి…. భార్యాభర్తకు పీడకలలా మారే ట్రిప్… క్రేజీ మలయాళ సస్పెన్స్ థ్రిలర్
Advertisement

OTT Movie : ట్విస్టులతో అదిరిపోయే సినిమాలు మలయాళం ఇండస్ట్రీ నుంచి బాగానే వస్తున్నాయి. రీసెంట్ గా ఇటువంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా అందుకున్నాయి. వీటిని పాన్ ఇండియా రేంజ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక డిఫరెంట్ స్టోరీ తో వచ్చాడు దర్శకుడు. శ్రీలంక సంక్షోభంలో ఒక ఇండియన్ జంట, మ్యారేజ్ డే సెలబ్రేషన్ కి వెళ్ళినప్పుడు జరుగుతుంది. అక్కడ కొన్ని అనుకోని సంఘటనలతో స్టోరీ మరో లెవల్ కి వెళుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…

మనోరమ మాక్స్ (Manorama MAX) లో

Advertisement

ఈ మలయాళం డ్రామా మూవీ పేరు ‘పారడైజ్’ (Paradise). 2023 లో విడుదలైన ఈ మూవీకి శ్రీలంకన్ దర్శకుడు ప్రసన్న వితానగే దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రోషన్ మాథ్యూ, దర్శన రాజేంద్రన్, శ్యామ్ ఫెర్నాండో, మహేంద్ర పెరెరా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఒక భారతీయ జంట వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి, సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు వెళ్లడంతో అసలు స్టోరీ మొదలు అవుతుంది. ఈ మూవీ 2023 బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, కిమ్ జిసెక్ అవార్డును గెలుచుకుంది. జూన్ 28, 2024 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమ మాక్స్ , సింప్లీ సౌత్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

2022లో శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. ఆ సమయంలో దేశం దివాలా తీసినట్లు కూడా ప్రకటిస్తుంది. మరవైపు కేశవ్, అమృత అనే మలయాళీ దంపతులు తమ ఐదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి శ్రీలంకకు వస్తారు. కేశవ్ ఒక సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తాడు. అతడు నిర్మించిన కథను ఒక OTT ప్లాట్‌ ఫామ్ ఆమోదించడంతో కేశవ్ సంతోషంగా ఉంటాడు. వారు శ్రీలంకలోని పురాతన దేవాలయాలను, ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించాలని ప్లాన్ చేస్తారు. వారి గైడ్ ఆండ్రూ వారిని ఒక హోమ్‌స్టేకు తీసుకెళతాడు. అయితే, వారి ఆనందం ఎక్కువ సేపు నిలవదు. ఒక రాత్రి, దొంగలు వారి హోమ్‌స్టేలోకి చొరబడి కత్తులు చూపి ల్యాప్‌టాప్, టాబ్లెట్, ఫోన్‌లను దొంగిలిస్తారు. కేశవ్ తన ఫైల్స్ కోల్పోవడంతో కంగారు పడతాడు. పోలీసుల వద్ద ఫిర్యాదు చేయాలని అనుకుంటాడు. అయితే, దేశంలోని అస్థిర పరిస్థితుల కారణంగా పోలీసులు సహకరించడానికి ఇష్టపడరు. కేశవ్ భారత హై కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో, సీనియర్ సార్జెంట్ బందార దర్యాప్తు ప్రారంభిస్తాడు.దర్యాప్తులో, కేశవ్ ముగ్గురు స్థానిక తమిళ యువకులను దొంగలుగా గుర్తిస్తాడు.

అయితే వాళ్ళకు దొంగతనానికి సంబంధం ఉండదు. అసలు దొంగలు వేరే ఉంటారు. అయితే అమృతకు అతని నిర్ణయంపై సందేహం ఉంటుంది. పోలీసు వాళ్ళను టార్చర్ చేయడంతో, కస్టడీలోనే ఒక యువకుడు చనిపోతాడు. దీనితో అమృతలో గిల్టీ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇంత జరిగినా కేశవ్ తన తప్పును ఒప్పుకోడు. ఈ సంఘటన వారి వివాహంలో చిచ్చు పెడుతుంది. కేశవ్ యొక్క అహంకారం, అమృతకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఒక అల్లర్ల సందర్భంలో అమృత కేశవ్‌ను తుపాకీతో కాల్చి చంపుతుంది. ఇది ఒక షాకింగ్ ట్విస్ట్‌గా మారుతుంది. చివరికి అసలు దొంగలు దొరుకుతారా ? కేశవ్ ను అంత దారుణంగా అమృత ఎందుకు చంపుతుంది ? ఈ విషయాలను సినిమా చూసి తెలుసుకోండి. ఈ సినిమా రామాయణంతో సమాంతరంగా నడుస్తుంది. అమృత సీతగా ఉంటే, కేశవ్ రాముడు, రావణుడి మధ్య అస్పష్టమైన పాత్రగా ఉంటాడు. చివరిలో ఈ సినిమా ప్రేక్షకులను కూడా ఆలోచనలో పడేస్తుంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×