E-Paper
Advertisement

OTT Movie : పశువుల డాక్టర్ గా బాసిల్ జోసెఫ్ … ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?

OTT Movie : పశువుల డాక్టర్ గా బాసిల్ జోసెఫ్ … ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?
Advertisement

OTT Movie : మలయాళం హీరో బాసిల్ జోసెఫ్ ని ఇప్పుడు ఎక్కువగా అభిమానిస్తున్నారు ప్రేక్షకులు. పక్కింటి అబ్బాయిలా అనిపించే ఈ హీరో మినిమం గ్యారంటీ తో దూసుకుపోతున్నాడు. ఈ హీరో రీసెంట్ గా నటించిన అన్ని సినిమాలు, మంచి కలెక్షన్స్ సాధించాయి. సిక్స్ ప్యాక్ తో ఆరడుగుల ఎత్తు లేకపోయినా, అభినయంతో ఆకట్టుకుంటున్నాడు జోసెఫ్. అయితే ఈ మలయాళం హీరో నటించిన ఒక మూవీ థియేటర్లలో అంతగా ఆడకపోయినా, ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

స్టోరీలోకి వెళితే

Advertisement

ప్రసూన్ యానిమేటర్‌గా తన కెరీర్‌ను కొనసాగించాలని కలలు కంటాడు. కానీ తండ్రి మరణం తర్వాత, కుటుంబ ఒత్తిడి కారణంగా అతను ఒక గ్రామంలో వెటరనరీ డాక్టర్ గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరవలసి వస్తుంది. ఈ ఉద్యోగం అతని కలలకు విరుద్ధంగా ఉండటంతో, అతను పని పట్ల నిరాసక్తితో ఉంటాడు. ఆ గ్రామీణ వాతావరణంలో సర్దుకుపోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడతాడు. గ్రామంలోని ప్రజలతో, జంతువులతో ప్రసూన్ చేసే ప్రయాణం అతనికి ఒక సవాలుగా మారుతుంది. అతని అనుభవరాహిత్యం, పని పట్ల అయిష్టత కారణంగా అతను తప్పుడు ఆరోపణలకు గురవుతాడు. ఒకానొక సమయంలో ఈ ఉద్యోగాన్ని విడిచి వెళ్లిపోవాలని అనుకుంటాడు. అతను తన సహోద్యోగి స్టెఫీ సహాయంతో క్రమంగా ఈ పరిస్థితులకు అలవాటు పడతాడు. ఒక రోజు గర్భిణీ ఆవుకు చికిత్స చేసే సమయంలో, ప్రసూన్ జీవితంలో మార్పును తెస్తుంది. ఈ సంఘటన అతన్ని మనుషులు, జంతువుల మధ్య సంబంధాన్ని గౌరవించేలా చేస్తుంది. చివరికి ప్రసూన్ వెటరనరీ డాక్టర్ గానే ఉండిపోతాడా ? యానిమేటర్‌ కావాలనే ఆశయం ఏమౌతుంది. అతని జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి ? అనే విషయాలను, ఈ మలయాళం సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : దిక్కు మాలిన ఐడియాతో కోట్లు కొల్లగొట్టే ప్లాన్… ఊహించని ట్విస్ట్ తో అడ్డంగా బుక్కయ్యే తింగరోడు

Advertisement

జియో హాట్ స్టార్ (Jio hotstar) లో

మలయాళ కామెడీ డ్రామా మూవీ పేరు ‘పల్తు జాన్వార్’ (Palthu Janwar). 2022 లో విడుదలైన ఈ సినిమాకి సంగీత్ పి.రాజన్ దర్శకత్వం వహించారు. ఇందులో బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించగా, ఇంద్రన్స్, జానీ ఆంటోనీ, దిలీష్ పోతన్, షమ్మీ తిలకన్ సహాయక పాత్రల్లో నటించారు. భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కథ ప్రసూన్ (బాసిల్ జోసెఫ్) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×