E-Paper
Advertisement

OTT Web series : భర్త పట్టించుకోకపోవడంతో మరిదిపై ఇష్టాన్ని పెంచుకునే అమ్మాయి… భర్తకు తెలిసి….

OTT Web series : భర్త పట్టించుకోకపోవడంతో మరిదిపై ఇష్టాన్ని పెంచుకునే అమ్మాయి… భర్తకు తెలిసి….
Advertisement

OTT Web series : ఓటిటి ప్లాట్ ఫామ్ సినిమాలకే కాకుండా, వెబ్ సిరీస్ లకు కూడా మంచి వేదికగా ఉంది. ఈ వెబ్ సిరీస్‌లు  ఓటిటిలో డైరెక్ట్ గానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. 18వ శతాబ్దం చివరి అంకంలో జరిగే ఒక స్టోరీతో ఒక వెబ్ సిరీస్ ని చిత్రీకరించారు మేకర్స్. ఈ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? తెలుసుకుందాం పదండి…

అమెజాన్ ప్రైమ్ వీడియో

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకునే ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ పేరు ” స్టోరీస్ బై రవీంద్రనాథ్ ఠాగోర్ – ది బ్రోకన్ నెస్ట్”  (Stories by Rabindranath Tagore – The Broken Nest). ఈ వెబ్ సిరీస్ లో భర్త భార్యను సరిగ్గా పట్టించుకోకపోవడంతో, భార్య మరిదిపై ప్రేమను పెంచుకుంటుంది. ఆ తరువాత మరిది దూరం అవ్వడంతో ఆ అమ్మాయి ఏం చేస్తుందనేది చివరి వరకూ ఈ సిరీస్ చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ పది ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటిటి ఫ్లాట్ ఫామ్ ‘ఎపిక్ ఆన్’ (Epic on) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

చారులత భూపతి మంచి భార్య భర్తలుగా ఉంటారు. భూపతి కి ఒక పత్రిక నడపాలని కోరికగా ఉంటుంది. అలాగే ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఒక పత్రికను నడుపుతాడు. ఇందుకోసం తన భార్య అన్నని తోడుగా ఉండటానికి ఇంటికి పిలిపించుకుంటాడు. భూపతి పత్రిక నడపడానికి సమయం ఎక్కువగా కేటాయిస్తూ భార్యను పట్టించుకోకుండా ఉంటాడు. భార్య ఒంటరిగా ఫీల్ అవుతూ  ఉంటుంది. ఇంతలో భూపతి తమ్ముడు అమల్ భూపతి ఇంటికి వస్తాడు. అతడు మాటకారి కావడంతో భూపతి భార్య అతనికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. సమయం దొరికినప్పుడల్లా వీళ్ళిద్దరూ మాటలు కలుపుతూ, ఇంట్లో పనులు అన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ పరిస్థితుల్లోనే భూపతి భార్య అతన్ని చూడకుండా ఒక నిమిషం కూడా ఉండలేక పోతుంది. మరోవైపు భూపతి తన పత్రికను పూర్తిగా చారులత అన్నకి అప్పగిఇస్తాడు. అతడు మాత్రం ఆ పత్రిక మీద అప్పులు చేసి భూపతికి ఊరికి వెళ్లాలని చెప్పి వెళ్లిపోతాడు.

అప్పుల వాళ్లు భూపతికి త్వరగా అప్పు చెల్లించాలని వార్నింగ్ ఇస్తారు. భూపతి తమ్ముడు చదువు నిమిత్తం లండన్ కి వెళ్ళిపోతాడు. చారులత అమల్ ని తలుచుకుంటూ దిగాలిగా ఉండిపోతుంది. ఇప్పుడు భర్త ఆమెకు సమయాన్ని కేటాయించినా ఆమె నుంచి స్పందన లేకుండా ఉంటుంది. చివరికి చారులత తన మరిది కోసం తపించి ఏమవుతుంది? చారులత అన్న చేసిన అప్పులను భూపతి తీరుస్తాడా? మరిదితో ఈ సంబంధం ఎన్నాళ్లు కొనసాగుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ‘ఎపిక్ ఆన్’ (Epic on) లో స్ట్రీమింగ్ అవుతున్న స్టోరీస్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ – ది బ్రోకన్ నెస్ట్”  ( Stories by Rabindranath Tagore – The Broken Nest) వెబ్ సిరీస్ ని చూసి ఎంజాయ్ చేయండి. ఈ వెబ్ సిరీస్ ను వీకెండ్ లో ఫ్యామిలీ తో కలసి చూడండి.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×