E-Paper
Advertisement

OTT Web Series : రాత్రికి రాత్రి ఆరుగురు ఫ్యామిలీ మెంబర్స్ మర్డర్… IMDbలో రేటింగ్ 7.6… ఐదేళ్ల తరువాత రాబోతున్న సీక్వెల్

OTT Web Series : రాత్రికి రాత్రి ఆరుగురు ఫ్యామిలీ మెంబర్స్ మర్డర్… IMDbలో రేటింగ్ 7.6… ఐదేళ్ల తరువాత రాబోతున్న సీక్వెల్
Advertisement

OTT Web Series: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన జానర్లలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌ కూడా ఒకటి. ప్రేక్షకులు ఈ థీమ్ ఆధారంగా తెరకెక్కే సినిమాలు, వెబ్ సిరీస్‌లను సెపరేట్ గా ఓటీటీలలో వెతుకుతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరు కూడా క్రేజీగా మర్డర్ మిస్టరీలను వెతుకుతుంటే ఈ న్యూస్ మీ కోసమే. ఓటీటీలోనే పాపులర్ అయిన మర్డర్ మిస్టరీ సినిమాలలో ఒకదాని గురించి ఈ రోజు చెప్పుకోబోతున్నాము. పైగా ఈ మూవీకి IMDbలో 7.2 రేటింగ్ ఉండడం విశేషం. మరి ఆ సినిమా పేరేంటి? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

ఐదేళ్ల తరువాత వచ్చిన సీక్వెల్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ‘రాత్ అకేలి హై’ సీక్వెల్ ‘రాత్ అకేలి హై 2’. హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించిన ‘రాత్ అకేలి హై: ది బన్సాల్ మర్డర్స్’ చిత్రం 2020లో విడుదలైంది. ఇప్పుడు సీక్వెల్ గా అదే టైటిల్ తో ‘రాత్ అకేలి హై 2’ రిలీజ్ అయ్యింది. ఈ సీక్వెల్ గురించే ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐదేళ్ల తరువాత ఆ ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడింది. డిసెంబర్ 19న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది మూవీ. అయితే ఈసారి ఈ చిత్రంలో కొత్త కేసు ఉంది. నవాజుద్దీన్ సిద్ధిఖీతో పాటు, రాధికా ఆప్టే, చిత్రాంగద సింగ్, దీప్తి నావల్, అరుణ్ బాజ్‌పాయ్, రేవతి ఆశా కెలుని, రజత్ కపూర్, సంజయ్ కపూర్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రపంచ ప్రీమియర్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : 50 లక్షల బడ్జెట్ 100 కోట్ల కలెక్షన్స్… దిక్కుతోచని స్థితిలో బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్

కథలోకి వెళ్తే…

మొదటి పార్ట్ లో ఒక సంపన్న కుటుంబంలో జరిగే హత్య చుట్టూ కథ తిరుగుతుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ వృద్ధ రాజకీయ నాయకుడి హత్యను దర్యాప్తు చేస్తాడు. ఈ కేసులో కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అనుమానితులుగా ఉంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన యువ భార్య (రాధికా ఆప్టే). దానికి కొనసాగింపుగా వస్తోంది సీక్వెల్. ఒకే రాత్రిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యుల అనుమానాస్పద మరణాలతో కథ ప్రారంభమవుతుంది. ఫ్యామిలీ మొత్తం దారుణంగా మర్డర్ కు గురైతే, ఒకే ఒక్క అమ్మాయి ఆ ఘోరమైన పరిస్థితి నుంచి బయట పడుతుంది. సంచలనంగా మారే ఈ కేసుతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమై, నిందితుడిని పట్టుకునేందుకు కేసును దర్యాప్తు చేస్తారు. పోలీసులు మృతుల కుటుంబ సభ్యులలో కొంతమందిని ప్రశ్నిస్తారు. కానీ తరువాత ఈ హత్య కేసులో ఓ సీక్రెట్ దాగి ఉందని తెలుసుకుంటారు. మరి ఆ హత్యలకు కారణం ఏంటి? ఆ అమ్మాయి ఒక్కతే ఎలా బతికి బయట పడింది ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×