E-Paper
Advertisement

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు
Advertisement

OTT Releases This Week : మే నెల ముగిసి జూన్ మొదటి వారం మొదలయింది. ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు యాక్షన్, డ్రామా, క్రైమ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిపోయాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన అనేక చిత్రాలు, సిరీస్‌ లు ఈ వారం విడుదలవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

1. నిశ్శబ్దం (Nissabdam)

ETV Win ఓటీటీలో మే 31 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ షురూ అయ్యింది. ఆంటోనీ మట్టిపల్లి దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ షార్ట్ ఫిల్మ్ లో మానవ సంబంధాలు, వ్యక్తిగత పోరాటాలను స్ట్రెయిట్ గా, హార్ట్ టచింగ్ గా చూపించారు . సుధ, లావణ్య, జయంత్, రాఘవ ప్రధాన పాత్రలు పోషించారు. సింపుల్ స్టోరీతో మెప్పించే చిత్రం ఇది.

2. కార్మెని సెల్వం (Karmani Selvam)

Advertisement

తమిళ ఫ్యామిలీ డ్రామా ‘కార్మెని సెల్వం’ జూన్ 3న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోంది. సముద్రఖని, గౌతం వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా చంద్రమౌళి నటించిన ఈ చిత్రం ఒక టాక్సీ డ్రైవర్ జీవిత సంఘర్షణలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల మధ్య అతను ఎదుర్కొనే సవాళ్లు కన్నీళ్ళు తెప్పిస్తాయి. తెలుగు డబ్బింగ్‌ తో కూడా అందుబాటులో ఉంటుంది.

3. మేడ్ ఇన్ ఇండియా: ఎ టైటాన్ స్టోరీ (Made in India: A Titan Story)

జూన్ 3న అమెజాన్ MX ప్లేయర్‌లో విడుదలవుతున్న ఆరు ఎపిసోడ్‌ల పీరియడ్ డ్రామా ఇది. టైటాన్ వాచీల సృష్టి వెనుక ఉన్న అద్భుతమైన ప్రయాణం, భారతదేశపు ప్రతిష్టాత్మక బ్రాండ్‌ ను నిర్మించిన దార్శనికుల కథ ఇది. నసీరుద్దీన్ షా, జిమ్ సర్భ్ నటించారు. తెలుగు డబ్బింగ్ ఆప్షన్ కూడా రానుంది.

4. ధురంధర్ : ది రివేంజ్ (Dhurandhar : The Revenge)

Advertisement

జూన్ 4 న సాయంత్రం 7 గంటలకు జియో హాట్‌స్టార్‌లో విడుదలవుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ : ది రివేంజ్’. రణవీర్ సింగ్, మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ నటించిన ఈ చిత్రం “రా” కట్‌లో వస్తోంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

5. గుల్లక్ సీజన్ 5 (Gullak Season 5)

జూన్ 5న సోనీ లివ్‌లో విడుదలవుతున్న ఈ ఫ్యామిలీ డ్రామా సీజన్ మళ్లీ మిశ్రా కుటుంబ జీవితంలోకి తీసుకెళ్తుంది. హాస్యం, ఎమోషన్, రోజువారీ సవాళ్లతో నిండిన ఈ సిరీస్ మధ్యతరగతి జీవితాన్ని అందంగా చూపిస్తుంది. ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Also Read : క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

6. మా బెహెన్ (Maa Behen)

నెట్‌ఫ్లిక్స్ జూన్ 4న విడుదల చేయనున్న డార్క్ కామెడీ మూవీ. మాధురీ దీక్షిత్, త్రిప్తి దిమ్రి, ధరణ దుర్గ నటించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా రానుంది.

7. పేట్రియాట్ (Patriot)

జూన్ 5న ZEE5లో విడుదలవుతున్న మలయాళ యాక్షన్ డ్రామా ఇది. మమ్ముట్టి, మోహన్‌లాల్, ఫహద్ ఫాసిల్, నయనతారలు నటించిన ఈ చిత్రం తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ వారం యాక్షన్, డ్రామా, క్రైమ్, కామెడీ అన్నీ ఉన్నాయి.

వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్ లో జూన్ 5న మలయాళ మూవీ ’29’, కన్నడ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కేడీ: ది డెవిల్’ 2026 జూన్ 5న ZEE5లో, కరిష్మా కపూర్ ‘బ్రౌన్’ సిరీస్‌ జూన్ 5న జీ5లో, అమెజాన్ ప్రైమ్ వీడియో కొత్త ఒరిజినల్ సిరీస్ ‘ది పిరమిడ్ స్కీమ్’ జూన్ 5న స్ట్రీమింగ్ కానున్నాయి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×