E-Paper
Advertisement

The Cut OTT Release date : ఓర్లాండో బ్లూమ్ గ్రిప్పింగ్ బాక్సింగ్ థ్రిల్లర్‌… ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?

The Cut OTT Release date : ఓర్లాండో బ్లూమ్ గ్రిప్పింగ్ బాక్సింగ్ థ్రిల్లర్‌… ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Advertisement

The Cut OTT Release date : గత సంవత్సరం సెప్టెంబర్‌లో యుఎస్ థియేటర్లలో విడుదలై, ఓర్లాండో బ్లూమ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న సైకలాజికల్ బాక్సింగ్ థ్రిల్లర్ ‘ది కట్’ ఇప్పుడు ఓటీటీ అరంగేట్రం కోసం సిద్ధమవుతోంది. మరికొన్ని గంటల్లో భారతదేశంలోని అభిమానులను, ఈ సినిమా క్రేజీ రైడ్‌లో తీసుకెళ్ళబోతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 2024లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబడింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై మంచి హిట్ కొట్టింది. ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

లయన్స్‌గేట్ ప్లేలో స్ట్రీమింగ్

సీన్ ఎల్లిస్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ది కట్’ (The cut) స్ట్రీమింగ్ హక్కులను లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play) పొందింది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 30 నుండి దాని సబ్‌స్క్రిప్షన్ ద్వారా ‘ది కట్‌’ను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చెయ్యచ్చు. ఇది ఇంగ్లీష్, హిందీ వంటి భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో ఓర్లాండో బ్లూమ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ పాత్ర కోసం ఆయన నిజంగానే సుమారు 23 కిలోల బరువు తగ్గడం విశేషం. బాక్సర్ కోచ్‌గా జాన్ టుర్టురో నటించారు. కైట్రియోనా బాల్ఫ్ బాక్సర్ భార్య పాత్రలో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రిటైర్ అయిన ఒక బాక్సర్ తన కెరీర్‌లో చివరిసారిగా టైటిల్ కోసం పోరాడాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఆ పోటీకి అర్హత సాధించడానికి కేవలం ఆరు రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. అయితే అందుకుగాను అతను భారీగా బరువు తగ్గాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అతను పడే శారీరక, మానసిక వేదనను ఈ సినిమా అత్యంత భయంకరంగా చూపిస్తుంది. అసలు ఎందుకు అతను ఆ వయసులో టైటిల్ గెలవాలనుకున్నాడు ? చివరికి అనుకున్నది సాధించాడా ? అనే వివరాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : 2000 ఎత్తున్న టవర్ పై ఇద్దరే అమ్మాయిలు… ఒక్కో టర్న్ కి గుండె జారిపోద్ది… నెక్స్ట్ ఏం జరుగుతుందన్న టెన్షన్ కే పోతారు భయ్యా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×