// // OTT Movie : "రాజు వెడ్స్ రాంబాయి" నుంచి "నయనం" వరకు... -->
E-Paper
Advertisement

OTT Movie : “రాజు వెడ్స్ రాంబాయి” నుంచి “నయనం” వరకు… ఈ వారం ఓటీటీలో మిస్సవ్వకుండా చూడాల్సిన తెలుగు సినిమాలు

OTT Movie : “రాజు వెడ్స్ రాంబాయి” నుంచి “నయనం” వరకు… ఈ వారం ఓటీటీలో మిస్సవ్వకుండా చూడాల్సిన తెలుగు సినిమాలు
Advertisement

OTT Movies : ప్రతీవారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీస్ లు అడుగు పెడతాయి. కానీ అందులో తెలుగు సినిమాలను మాత్రం వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఇన్ని ఓటీటీలు ఉన్నా కూడా ప్రతీవారం తెలుగు ఆడియన్స్ ను నిరాశ తప్పట్లేదు. తెలుగులో డబ్ అయ్యే సిరీస్, సినిమాలను వెతుక్కుని ఆనందపడుతున్నారు. కానీ ఈ వారం మాత్రం ఏకంగా 5 తెలుగు సినిమాలో ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. తెలుగు మూవీ లవర్స్ అయితే వీకెండ్ ఆ సినిమాలను అస్సలు మిస్ కావొద్దు. రొమాన్స్ నుండి థ్రిల్లర్‌లు, డ్రామా వరకు అన్నీ జానర్ల సినిమాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి.

ప్రేమంటే (Premante)

ఈ వారం విడుదలైన అత్యంత చర్చనీయాంశమైన చిత్రాలలో ఒకటి “ప్రేమంటే”. ప్రియదర్శి పులికొండ, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రేమ, అనుబంధాలను అందంగా చూపించే రొమాంటిక్ డ్రామా. ఎమోషనల్ ఎలిమెంట్ తో పాటు కామెడీ కూడా ఉంది. ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. ఈ చిత్రం డిసెంబర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.

​దివ్య దృష్టి (Divya Drishti)

Advertisement

హర్రర్, థ్రిల్స్ ని ఆస్వాదించే వారికి “దివ్య దృష్టి” బెస్ట్. భవిష్యత్తును చూసే ప్రత్యేక శక్తిని కలిగి ఉన్న ఇద్దరు సోదరీమణుల చుట్టూ కథ తిరుగుతుంది. కానీ ఈ శక్తి క్రమంగా వారికి ముప్పుగా మారుతుంది. మిస్టరీ, హర్రర్ తో నిండిన ఈ చిత్రం సన్ నెక్స్ట్ లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

నయనం ​(Nayanam Web series)

వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు వెబ్ సిరీస్ “నయనం”. ప్రమాదకరమైన ప్రయోగాలు చేసే వ్యక్తి కథను చెప్పే సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. సస్పెన్స్, ఊహించని మలుపులతో నిండిన ఈ సిరీస్ డిసెంబర్ 19 నుంచి జీ ఫైవ్‌లో ప్రసారం అవుతుంది

రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai)

Advertisement

రొమాంటిక్ డ్రామాలను ఆస్వాదించే ప్రేక్షకుల కోసం “రాజు వెడ్స్ రాంభాయ్” కూడా ఈ వారం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ చిత్రం సమాజం, కుటుంబం నుండి అడ్డంకులను అధిగమించే ఒక గ్రామీణ అబ్బాయి, అమ్మాయి ప్రేమకథ. ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని డిసెంబర్ 18 నుంచి ETV Winలో చూడవచ్చు.

ఫార్మా (Pharma its just business)

“ఫార్మా” తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఫార్మా పరిశ్రమ సీక్రెట్స్ ను, పోరాటాలను బహిర్గతం చేసే మెడికల్ థ్రిల్లర్ డ్రామా ఇది. ఈ చిత్రం డిసెంబర్ 19 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

Read Also : రిమోట్ ఐలాండ్లో అమ్మాయిల అరాచకం… బ్లాక్ మ్యాజిక్ తో ఒళ్లు గగుర్పొడిచే ఎలిమెంట్స్… హర్రర్ మూవీ కంటే ఘోరం

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×