E-Paper
Advertisement

OTT Movies: దీపావళి స్పెషల్.. ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movies: దీపావళి స్పెషల్.. ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..
Advertisement

OTT Movies: ప్రతి వారం థియేటర్లలోకి కొత్త సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని లేదు. కొన్ని సినిమాలు కేవలం ఒకటి రెండు రోజులకు మాత్రమే థియేటర్ నుంచి వెళ్లిపోతే.. ఇంకొన్ని స్టార్ హీరోలు సినిమాలైతే ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. ఇకపోతే ఈ మధ్య భారీ చిత్రాల కన్నా చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. మరి థియేటర్ లోకి వచ్చిన ప్రతి సినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. బోలెడు సినిమాలు డిజిటల్ ప్లాట్ఫామ్లలోకి స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి..

ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. గతవారంతో పోలిస్తే ఈ వారం కాస్త తక్కువ సినిమాలే స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. పది సినిమాలలోపలే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే ఈ సారి వెబ్‌ సిరీస్‌ల హడావుడి కంటే ఓటీటీ సినిమాల హంగామా ఎక్కువగా ఉంది. అందులోనూ పవన్‌ కళ్యాణ్‌ మూవీపై అందరి చూపు ఉంది.. థియేటర్లలో సక్సెస్ఫుల్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతుంది. విజయ్‌ ఆంటోనీ హీరోగా నటించిన `భద్రకాళి` మూవీ కూడా ఓటీటీలోకి రాబోతుంది.. జాన్వి కపూర్ నటించిన పరమ్ సుందరి కూడా ఓటీటీ లోకి వచ్చేస్తుంది. ఈ మూడు సినిమాలపై జనాలు కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈవారం ఏ ప్లాట్ఫారంలోకి ఏ సినిమా రాబోతుందో ఒకసారి తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే..

నెట్ ఫ్లిక్స్.. 

Advertisement

ఓజీ – అక్టోబర్ 23 స్ట్రీమింగ్ కాబోతుంది.

నో బడి వాంట్స్ థిస్ సీజన్ 2 ( వెబ్ సిరీస్)- అక్టోబర్ 23

Advertisement

కురుక్షేత్ర పార్ట్ 2 ( యానిమెటెడ్ వెబ్ సిరీస్) – అక్టోబర్ 24

ఏ హౌజ్ ఆఫ్ డైనమైట్- అక్టోబర్ 24

ది డ్రీమ్ లైఫ్ ఆఫ్ మిస్టర్ కిమ్ ( వెబ్ సిరీస్ ) – అక్టోబర్ 25

అమెజాన్ ప్రైమ్ వీడియో.. 

ఎలివషన్ – అక్టోబర్ 21

ఈడెన్ – అక్టోబర్ 24

సోని లీవ్..

మీరాజ్ – ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

జియో హాట్ స్టార్.. 

మహా భారత్ – ఏక్ ధర్మ యుద్ ( వెబ్ సిరీస్ ) – అక్టోబర్ 25

Also Read : అవనిని అవమానించిన పల్లవి.. భానుమతి క్లాస్.. పల్లవికి షాకిచ్చిన అవని..

మొత్తానికి ఈ వారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద పండుగనే చెప్పాలి. థియేటర్లలో సక్సెస్ టాక్ ని అందుకున్న ఓజీ మూవీ ఓటిటి లోకి రాబోతుంది. ఇప్పటివరకు డేట్ ని లాక్ చేసుకునింది ఈ సినిమాలో మాత్రమే.. సడన్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. త్వరలోనే వాటి గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. అలాగే వెబ్ సిరీస్ కూడా కొత్తగా స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.. ఇకపోతే థియేటర్లలోకి ఈనెల కొత్త సినిమాలు రాబోతున్నాయని తెలుస్తుంది.. స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా డిసెంబర్ కి షిఫ్ట్ అయ్యాయి. మరి ఏ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే..

 

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×