E-Paper
Advertisement

OTT Movies : ఓటీటీలో ఈ వీకెండ్‌ మిస్ కాకుండా చూడాల్సిన బెస్ట్ మూవీస్ ఇవే

OTT Movies : ఓటీటీలో ఈ వీకెండ్‌ మిస్ కాకుండా చూడాల్సిన బెస్ట్ మూవీస్ ఇవే
Advertisement

OTT Movies : ఈ వీకెండ్ లో స్ట్రీమింగ్‌కు వచ్చే కొత్త సినిమాలు, సిరీస్‌లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. రొమాంటిక్ కామెడీ నుంచి సైకాలజికల్ థ్రిల్లర్, హారర్ ల వరకు – అన్ని రకాల ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీలోకి వచ్చేశాయి. వీటిని ఎక్కడ చూడచ్చో తెలుసుకుందాం పదండి.

1. ది బ్లఫ్ 

ప్రియాంక చోప్రా జోనాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఒకప్పుడు సముద్రపు దొంగగా ఉన్న మహిళ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మళ్లీ ఆయుధం పడుతుంది ఇందులో. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ తో ఈ సినిమా ఉంటుంది.

2. బుగోనియా 

Advertisement

ఎమ్మా స్టోన్, జెస్సీ ప్లెమోన్స్ నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 28న జియో హాట్‌స్టార్‌ (Jio hotstar) లో ప్రీమియర్ అయింది. ఒక కంపెనీ CEOను ఏలియన్ అని భావించి కిడ్నాప్ చేసే ఇద్దరు వ్యక్తుల చుట్టూ కథ తిరుగుతుంది. ఆస్కార్ సీజన్‌లో ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం నామినేషన్లను కూడా అందుకుంది ఈ సినిమా. ఈ వీకెండ్‌లో తప్పక చూడాల్సిన సినిమా ఇది.

3. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడటలేదు 

రాజీవ్ కనకాల, ఉదయ భాను నటించిన ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఫిబ్రవరి 27 నుంచి జీ5 (Zee5)లో స్ట్రీమింగ్ అవుతోంది. తప్పిపోయిన కూతురి కోసం తండ్రి చేసే పోరాటం, ఆ క్రమంలో బయటపడే కుటుంబ రహస్యాలతో మూవీ ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్యామిలీ థ్రిల్లర్ లను ఇష్టపడేవారికి బెస్ట్ మూవీ ఇది.

4. తడయం 

Advertisement

1999లో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ జీ5లో ఫిబ్రవరి 27 నుంచి ప్రీమియర్ అవుతోంది. సముద్రఖని డిటెక్టివ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. టెన్షన్ ఫుల్ గా సాగే ఇన్వెస్టిగేషన్ – థ్రిల్లర్ ఇది.

5. హనీ 

నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై నటించిన ఈ తెలుగు సైకాలజికల్ హారర్ థ్రిల్లర్ సన్ నెక్స్ట్, అమెజాన్ ప్రైమ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. క్షుద్ర పూజల చుట్టూ తిరిగే ఈ కథ రాత్రి సమయంలో చూడడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది.

6. ఇక్కీస్ 

పరమవీర చక్ర గ్రహీత అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 26 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అగస్త్య నంద, ధర్మేంద్ర నటించారు. 1971 యుద్ధ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఫ్యామిలీతో చూడడానికి బెస్ట్.

7. అక్యూజ్డ్ 

కొంకణ సేన్ శర్మ నటించిన ఈ సిరీస్ లైంగిక వేధింపుల ఆరోపణల చుట్టూ తిరుగుతుంది. ఒక గౌరవనీయమైన డాక్టర్ జీవితం ఒక్కసారిగా ఎలా తలకిందులైందో చూపిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 27 నుంచి అందుబాటులోకి వచ్చింది. సీరియస్ థీమ్, బలమైన పెర్ఫార్మెన్స్‌తో ఈ కథ సాగుతోంది.

Read Also : భార్య ఒకరితో భర్త మరొకరితో… సోషల్ మీడియాలో కొత్త ప్రేమ… క్లైమాక్స్ వరకు నవ్వులే

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×