E-Paper
Advertisement

OTT Movie : స్కూల్ కెళ్లే టీనేజర్స్ తల్లిదండ్రులైతే… “చిత్రం”లాంటి క్రేజీ మూవీ

OTT Movie : స్కూల్ కెళ్లే టీనేజర్స్ తల్లిదండ్రులైతే… “చిత్రం”లాంటి క్రేజీ మూవీ
Advertisement

OTT Movie : డిజిటల్ ప్లాట్ ఫామ్ ఓటిటిలో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఫీల్ గుడ్ మూవీస్ కొన్ని మాత్రమే ఉంటాయి. పదహారేళ్ల వయసులోనే తల్లిదండ్రులైతే ఎలా ఉంటుందో ఇదివరకే ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం సినిమాలో చూసాం. అదే తరహాలో ఒక ఇండోనేషియన్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో సన్నివేశాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. మూవీ లవర్స్ ఈ మూవీ ని చూస్తున్నంత సేపు ఒక మంచి మూవీ చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఇండోనేషియన్ మూవీ. ఇద్దరు స్కూల్ విద్యార్థులు హద్దులు దాటి ప్రెగ్నెంట్ వరకు వెళతారు. ఆ తర్వాత వాళ్లు ఎలా ఆ ప్రాబ్లం ని ఫేస్ చేశారనేకదాంశంతో  తెరకెక్కించారు మేకర్స్. ఈ మూవీ పేరు “టూ బ్లూ స్ట్రిప్స్” (Two blue stripes). ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

భీమ, ధార ఇద్దరు స్కూల్ విద్యార్థులకు 16 ఏళ్ళ వయసు ఉంటుంది. వీళ్లు ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. భీమ చదువులో వెనకబడి ఉండగా, ధారా మంచిగా చదువుతూ ఉంటుంది. ధారా ఒక రిచ్ కిడ్. భీమ మాత్రం ఒక పేదింటి అబ్బాయి. ఒకరోజు అనుకోకుండా ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత కొద్ది రోజులకు శరీరంలో మార్పులు రావడం గమనించిన ధార తను ప్రెగ్నెంట్ ఏమో అని భయపడుతుంది. ఆమె తిన్న ఫుడ్ కూడా వామిట్ అవ్వడంతో భయపడిన ధార, ఒక ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకొని చెక్ చేసుకోగా పాజిటివ్ రిసల్ట్ వస్తుంది. ఈ విషయం బాయ్ ఫ్రెండ్ అయిన భీమ కు చెప్పగా అబార్షన్ చేసుకోవాలని వీటిని మనం ఫేస్ చేయలేమని చెప్తాడు. ధారా ఒప్పుకోకపోవడంతో చివరికి ఆ బిడ్డను మనమే పెంచుదాం అనుకొని డిసైడ్ అవుతారు. ఆమె ఒకరోజు స్కూల్లో నడుచుకుంటూ వెళుతుండగా బాల్ తన తలకు తాకుతుంది. కింద పడ్డ అమ్మాయి నాకు ఏమైనా పర్లేదు నా బిడ్డకు ఏమీ కాకూడదు అంటుంది.

అక్కడ స్కూల్ పిల్లలు చాలామంది ఉండటంతో సీక్రెట్ బయట పడిపోతుంది. స్కూల్ ప్రిన్సిపాల్ వీళ్ళ పేరెంట్స్ ని రమ్మని చెప్పి, మీ పిల్లలు మా స్కూల్లో చదవడానికి కుదరదు అని చెప్తాడు. స్కూల్ యాజమాన్యంతో నా కూతురు ఏం చేసిందని తప్పంతా భీమదే కదా అని స్కూల్ యాజమాన్యం తో  వాగ్వాదం చేస్తాడు. చివరికి దారా ఇద్దరి ప్రమేయంతోనే ఇది జరిగింది నన్ను ఎవరు బలవంతం చేయలేదు అని చెప్పగా, ధార పేరెంట్స్ ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. భీమ పేరెంట్స్ మాత్రం ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారు. ఇల్లు చిన్నదిగా ఉండటంతో కాస్త సర్దుకోమని చెప్తారు. అప్పటినుంచి ధార కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. చివరికి ఆమె బిడ్డను కంటుందా? చదువుకోడానికి వీళ్ళిద్దరూ పడ్డ ఇబ్బందులు ఏమిటి? ధార తల్లిదండ్రులు వీళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేస్తారా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ని తప్పకుండా చూడండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×