E-Paper
Advertisement

OTT Movie : చచ్చినోడి సమాధి కోసం ప్రాణాల మీదకు తెచ్చుకునే హీరో… బెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్

OTT Movie : చచ్చినోడి సమాధి కోసం ప్రాణాల మీదకు తెచ్చుకునే హీరో… బెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఫాంటసీ సినిమాలను ఎంటర్టైన్మెంట్ కోసం అందరూ చూస్తారు. ఈ సినిమాలలో ఉండే విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. మరో లోకంలోకి తీసుకెళ్లే ఈ సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో చాలానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో 2023లో రిలీజ్ అయిన ఒక చైనీస్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.

యూట్యూబ్ (Youtube)

Advertisement

ఈ చైనీస్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు ‘టూంబ్ మేకింగ్ నోట్స్‘ (Tomb Making Notes). ఈ మూవీలో ఒక రాజు సమాధి కోసం హీరో, విలన్ వెతకడంతో స్టోరీ సాగుతూ ఉంటుంది. ఆ సమాధిలో చాలా నిధి ఉందని వీళ్ళు వెతుకుతూ ఉంటారు. చివరివరకూ సస్పెన్స్ గా సాగే  ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

హీరో పురాతన సమాధులను వెలికి తీసి అందులో రహస్యాలను కనుక్కుంటూ ఉంటాడు. ఇతని అసిస్టెంట్ ద్వారా ఆ విషయం తెలుసుకున్న విలన్ గ్యాంగ్ ఒక సమాధిని తెరవాలని ఇతన్ని కోరుతారు. హీరో ఆ సమాధిని, తన దగ్గరున్న ఒక పురాతనమైన వస్తువుతో తెరుస్తాడు. అయితే అందులో అస్తిపంజరం తప్ప ఏమీ ఉండదు. అప్పుడే హీరో అసిస్టెంట్ అందులో ఒక వస్తువును దొంగలిస్తాడు. ఆ వస్తువును తీసుకొని హీరోకి చూపిస్తాడు. అందులో ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ రాజు సమాధి ఎక్కడ ఉంటుందో చూపిస్తుంది. ఆ మ్యాప్ కోసం హీరోయిన్ కూడా అక్కడికి వస్తుంది. వీళ్ళతో ఫైట్ చేసి ఆ మ్యాప్ ని తీసుకుంటుంది. ఇంతలో అక్కడికి విలన్ గ్యాంగ్ కూడా వస్తారు. విలన్ గ్యాంగ్ దగ్గర గన్స్ ఉండటంతో, హీరోయిన్ వాళ్లతో ఫైట్ చేయలేక ఆ మ్యాప్ ని పాడు చేస్తుంది. విలన్ గ్యాంగ్ హీరోయిన్ ని చంపాలని చూస్తారు. రాజు సమాధి తనకు మాత్రమే తెలుసని, నన్ను చంపితే ఆ రహస్యం నాతోనే పోతుందని ఆమె చెబుతుంది.

విలన్ వీళ్ళందర్నీ ఒక వ్యాన్ లో తీసుకొని ఆ సమాధి ఎక్కడుందో వెతకడానికి వెళ్తారు. వెళ్లే క్రమంలో వీళ్లకు ఎనిమిది అవాంతరాలు ఎదురవుతాయి. గబ్బిలాలు, దయ్యాలు ఇలా అన్నిటిని వీళ్ళంతా అధిగమించుకుంటూ వెళ్తారు. చివరికి రాజు సమాధి దగ్గరికి చేరుకుంటారు. అయితే ఆ సమాధిని తెరవడానికి హీరో నానా తంటాలు పడతాడు. దానిని తెరవడానికి ఒక కీ అవసరం అవుతుంది. చాలా బంధనాలు ఆ సమాధికి వేసిఉంటాయి.  చివరికి హీరో ఆ సమాధిని తెరవగలుగుతాడా? అందులో నిజంగానే నిధి ఉంటుందా? ఇంకా ఏమైనా శక్తులతో పోరాడాల్సి వస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘టూంబ్ మేకింగ్ నోట్స్’ (Tomb Making Notes) అనే ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే. ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీని ఫ్యామిలీతో కలసి చూసి ఎంజాయ్ చేయండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×