E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయిలను చంపి బట్టలు లేకుండా పడేసే సైకో… గుండెల్లో గుబులు రేపే సైకో కిల్లర్ మూవీ

OTT Movie : అమ్మాయిలను  చంపి బట్టలు లేకుండా పడేసే సైకో…  గుండెల్లో గుబులు రేపే సైకో కిల్లర్ మూవీ
Advertisement

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ మూవీ లవర్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే టెన్షన్ తో ఆ మూవీని ఎంజాయ్ చేస్తూ చూస్తారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇదివరకు చాలానే వచ్చినా  ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? స్టోరీ ఏమిటో తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

Advertisement

ఇది ఒక హాలీవుడ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఒక సైకో కిల్లర్ చుట్టూ ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీలో ట్విస్టులు మీద ట్విస్టులు ఉంటాయి. హీరో ఆ సైకోని ఎలా కనిపెట్టాడు అనేది చివరి వరకు సస్పెన్స్ గా ఉంటుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు “ది రివర్ మర్డర్స్” (The River Murders). ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

హీరో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉంటాడు. హీరో భార్య ఒక కేఫ్ నడుపుతూ ఉంటుంది. హీరో ఆ కేఫ్ లో తన భార్యతో మాట్లాడుతుండగా, ఒక పోలీస్ ఆఫీసర్ అతని దగ్గరికి వచ్చి, సిటీలో ఒక బ్రిడ్జి దగ్గర ఒక అమ్మాయి చనిపోయి ఉంది. ఆ అమ్మాయి ఎవరో కాదు 12 సంవత్సరాల క్రితం నువ్వు డేటింగ్ చేసిన అమ్మాయి అని చెప్తుంది. హీరో ఆ చోటికి వెళ్లి చూడగా ఆ అమ్మాయిని ఒంటి మీద బట్టలు లేకుండా చంపి బ్రిడ్జి కింద బాడీని పెట్టి ఉంటారు. ఆ డేటింగ్ చేసిన అమ్మాయిని హీరో మొదట ఆ బ్రిడ్జి దగ్గరే కలుసుకొని ఉంటాడు. ఇలాగే మరొక మర్డర్ జరుగుతుంది. ఆమె కూడా ఇతనితో డేటింగ్ చేసి ఉంటుంది. ఆమెను కూడా ఇలాగే చంపి ఉంటారు. హీరో డేటింగ్ చేసిన అమ్మాయిలను ఎవరో సైకో కిల్లర్ చంపుతూ ఉంటాడు. మిగతా అమ్మాయిలను కాపాడాలంటే నువ్వు ఎంత మందితో డేటింగ్ చేశావో చెప్పాలని పోలీసులు హీరోని అడుగుతారు.

పోలీసులకు హీరో పూర్తి సమాచారం ఇస్తాడు. అయితే ఆ సైకో కిల్లర్ చనిపోయిన అమ్మాయిల నాలిక మీద సిలువ గుర్తు వేస్తూ ఉంటాడు. పోలీసులు ఆ హత్యలపై ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు. ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇంతకీ వరుసగా హత్యలు చేస్తున్న ఆ సైకో కిల్లర్ ఎవరు? పోలీసులు వెలుగులో తెచ్చిన విషయాలు ఏమిటి? హీరోకి ఆ హత్యలకు సంబంధం ఉందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ “ది రివర్ మర్డర్స్” (The River Murders) మూవీని తప్పకుండా చూడండి. ఈ థ్రిల్లర్ మూవీలో ప్రతి సీన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×