E-Paper
Advertisement

OTT Movie : ఒక జంట ప్రాణాలను బలి తీసుకున్న హార్రర్ మూవీ… నవ్వుతోనే భయపెట్టే డేంజరస్ సినిమా

OTT Movie : ఒక జంట ప్రాణాలను బలి తీసుకున్న హార్రర్ మూవీ… నవ్వుతోనే భయపెట్టే డేంజరస్ సినిమా
Advertisement

OTT Movie : ఓటిటిలో హారర్ సినిమాలకు ఉండే రెస్పాన్స్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజానికి సినిమా ఏదైనా థియేటర్లలో అయితే ఒకసారి చూసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఓటిటిలో మాత్రం మనసుకు నచ్చినన్నిసార్లు చూసే ఛాన్స్ ఉంటుంది. అందుకే థియేటర్లకంటే ఎక్కువగా ఓటీటీలే ప్రాధాన్యతను ఇస్తున్నారు మూవీ లవర్స్. అందులోనూ వణుకు పుట్టించే హర్రర్ సినిమాలు అంటే పడి చస్తున్నారు. చూస్తున్నంత సేపు గుండెల్లో గుబులు పుట్టించే హాలీవుడ్ హారర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఇక ఈరోజు మనం చెప్పుకునే ఓ జంట ప్రాణాలనే బలి తీసుకుంది. మరి ఇంత భయంకరంగా ఉన్న ఈ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? సినిమా పేరు ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్…

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా భయంకరమైన హారర్ మూవీ 2022 లో రిలీజ్ చేయగా, థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కానీ ఓటిటీ లోకి మాత్రం చాలా ఆలస్యంగా వచ్చింది. నవ్వుతూనే భయపెట్టి చంపే ఈ సినిమాను ఒంటరిగా చూస్తే వణికిపోవడం ఖాయం. ఒక సినిమాను చూసి భయపడి చాలా కాలం అయ్యింది అని ఫీల్ అయ్యే హారర్ మూవీ లవర్స్ ఈ మూవీని చూడాల్సిందే. ప్రస్తుతం ఏ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తెలుగు మూవీ లవర్స్ ను డిసప్పాయింట్ చేసే విషయం ఏమిటంటే ఈ మూవీ ఇంగ్లీష్ లో మాత్రమే అందుబాటులో ఉంది. భాష అడ్డు కాదు అనుకునేవారు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో హ్యాపీగా సినిమాను చూడొచ్చు.

స్టోరీ లోకి వెళ్తే…

Advertisement

రోజ్ కాటర్ ఒక సైకాలజీ డాక్టర్ గా పని చేస్తూ ఉంటుంది. మరోవైపు పీహెచ్డీ స్టూడెంట్ లారా వీవర్ తన బిహేవియర్ తో ఇబ్బందుల్లో పడుతది. ఆమె పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తుంది అనే కారణంతో పోలీసులు తీసుకొచ్చి రోజ్ దగ్గర పడేస్తారు. ఎమర్జెన్సీ కేస్ కింద తన దగ్గరకు వచ్చిన రోజ్ ను సమస్య ఏంటో అడిగి తెలుసుకుంటుంది. అయితే తనకున్న సమస్య ఏంటో బాగానే చెప్పిన లారా ఆ తర్వాత సడన్ గా రోజ్ ను చూసి నవ్వుతూనే సూసైడ్ చేసుకుని షాక్ ఇస్తుంది. ఈ ఊహించని పరిణామానికి రోజ్ మెంటల్ గా డిస్టర్బ్ అవుతుంది. లారా సూసైడ్ తర్వాత డాక్టర్ రోస్ జీవితంలో కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. మరి రోజ్ ఎదుర్కొన్న ఆ భయంకరమైన సంఘటనలు ఏంటి? లారా అలా నవ్వుతూ ఎందుకు చనిపోయింద ? ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయా? అసలు ఆ నవ్వు వెనక ఉన్న అర్థం ఏంటి? చివరికి తనను వెంటాడుతున్న తెలియని శక్తి నుంచి రోజ్ బయట పడగలిగిందా? ఆ నవ్వు చూస్తే చనిపోయే శాపం ఎలా వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ ‘స్మైల్’ అనే  మూవీని చూడాల్సిందే. ఈ సినిమాను 2020లో వచ్చిన ‘లారా హాస్ నాట్ స్లీప్’ అనే షార్ట్ ఫిలిం ఆధారంగా రూపొందించారు.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×