E-Paper
Advertisement

OTT Movie : నిద్ర అంటేనే వణుకు… ఇలాంటి భర్త కన్నా నరకమే బెటర్ అన్పించే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : నిద్ర అంటేనే వణుకు… ఇలాంటి భర్త కన్నా నరకమే బెటర్ అన్పించే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఓటిటిలో హర్రర్ సినిమాలకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ హర్రర్ మూవీస్ ఎంగేజింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ అంశాలతో సాగుతాయి కాబట్టి ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. అందులోనూ సైకలాజికల్ థ్రిల్లర్ హర్రర్ మూవీస్ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. అటువంటి ఒక కొరియన్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్ మూవీ అంటేనే ఇప్పుడు ట్రెండ్. అలాంటిది సైకలాజికల్ హారర్ కొరియన్ థ్రిల్లర్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ మూవీ పేరు ఏమిటో, కథ ఏమిటో తెలుసుకుందాం పదండి.

కథ విషయానికి వస్తే.. 

Advertisement

కొత్తగా పెళ్లయిన ఒక జంట సంతోషంగా జీవిస్తూ ఉంటారు. హ్యాపీగా ఉంటున్నాం అనుకునే లోపే ఒక పిడుగు లాంటి బయటకు వస్తుంది. చీకటైతే చాలు హీరోయిన్ గజగజ వణికి పోయే సంఘటనలు ఎదురవుతాయి. దానికి కారణం ఆమె భర్త కావడం గమనార్హం. నిద్ర పోయేటప్పుడు అంతా బాగుంటుంది. కానీ అతను నిద్రలో చేసే పనులు అర్దరాత్రి చెమటలు పట్టిస్తాయి. సాధారణంగా హర్రర్ మూవీస్ అంటే దయ్యం, అడవి, బోర్డ్ గేమ్స్ వంటివి చూపించి మేకర్స్ భయపెడతారు. కానీ ఈ సినిమాలో ఇలాంటివి ఏమీ లేకుండానే పేక్షకులు వణికిపోయేలా చేశాడు డైరెక్టర్. ఇక అసలు విషయంలోకి వెళ్తే హీరోకి ఒక విచిత్రమైన డిజార్డర్ ఉంటుంది. రాత్రి నిద్రపోయాక దయ్యం పట్టిన వాడిలా భయంకరంగా బిహేవ్ చేస్తాడు. ఒకానొక టైంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు. దీంతో భయపడిపోయిన ఆ భార్య అతన్ని క్యూర్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెడుతుంది. డాక్టర్ దగ్గరకు కూడా తీసుకెళ్తుంది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. అసలు ఆ భయంకరమైన వింత సమస్య అతన్ని పట్టి ఎందుకు పీడిస్తోంది? రాత్రి అయితే చాలు తనకు తెలియకుండానే ఎందుకు అంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ? భర్తను కాపాడుకోవడానికి ఆ భార్య ఏం చేసింది ? అతనికి నిజంగానే ఏదైనా వ్యాధి ఉందా లేక దయ్యం పట్టిందా ? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న స్లీప్ అనే ఈ సైకలాజికల్ హర్రర్ మూవీని చూడాల్సిందే.

Sleep (Korean) | Official Trailer | 2023

Advertisement

సినిమాకు అవార్డుల పంట 

2023 లో రిలీజ్ అయిన ఈ కొరియన్ హర్రర్ డ్రామా అప్పట్లో థియేటర్లను ఊపేసింది. ప్రేక్షకులను దయ్యం లేకుండానే భయపెట్టిన ఈ సినిమా ఎన్నో అవార్డులకు నామినేట్ అయింది అలాగే పలు అవార్డులను కూడా దక్కించుకుంది. ఇప్పటివరకు హర్రర్ సినిమాలు అంటే దయ్యం ఉంటుంది అని అనుకునే మూవీ లవర్స్ కి ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. సినిమాను చూశాక నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనడం పక్కా. ఇప్పటివరకు ఈ మూవీని హారర్ మూవీ లవర్స్ చూడకపోతే ఒక బెస్ట్ మూవీ ని మిస్ అయినట్టే. కాబట్టి ఇప్పటికైనా మిస్ అవ్వకుండా చూడాలంటే ఈ మూవీ ని మస్ట్ వాచ్ సినిమాల లిస్ట్ లో పెట్టుకోండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×