E-Paper
Advertisement

OTT Movie : బోర్డర్ లో సోల్జర్, ఇంటి దగ్గర భార్య వేరొకరితో డ్యూటీ… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : బోర్డర్ లో సోల్జర్, ఇంటి దగ్గర భార్య వేరొకరితో డ్యూటీ… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. ఈ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. దర్శకులు కూడా అందుకు తగ్గ కథలను తయ్యారు చేసుకుంటున్నారు. రీసెంట్ గానే థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న ఒక కన్నడ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే..

రెండు ఓటిటిలలో 

Advertisement

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘శాఖాహారి‘ (Shakahari). ఈ మూవీలో ఒక శాకాహారి హోటల్ నడిపే వ్యక్తిని, పోలీసుల నుంచి తప్పించుకున్న ఒక వ్యక్తి కలుస్తాడు. వీరి మధ్య స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel xstream), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

సుబ్బన్న అనే వ్యక్తి ఒక శాఖాహారి హోటల్ ని నడుపుతూ ఉంటాడు. ఇతని దగ్గరికి ఒక కేసులో అరెస్టు అయిన వ్యక్తి పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని వస్తాడు. అతని కాలికి బుల్లెట్ గాయం కూడా ఉంటుంది. ఆ వ్యక్తి పేరు విజయ్ అని తెలుసుకుంటాడు సుబ్బన్న. విజయ్ సుబ్బన్నకి తన స్టోరీ చెప్తాడు. తనకు ఆర్మీలో జాబ్ రావడంతో సౌగంధిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఎక్కువ సమయం విజయ్ ఆర్మీలోనే గడపాల్సి వస్తుంది. ఇంటి దగ్గర ఉన్న సౌగంధిక మదన్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంటుంది. అతనితో రొమాన్స్ చేస్తూ తిరుగుతూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న మదన్ ఫ్రెండ్, నీ భార్య ప్రవర్తన సరిగా లేదని విజయ్ తో చెప్తాడు. నెల రోజులు లీవ్ పెట్టి ఇంటికి వస్తాడు విజయ్. భార్యతో ఎందుకు అలా చేస్తున్నావని అడుగుతాడు. దీనికి కారణం నువ్వే అంటూ సమాధానం చెబుతుంది భార్య. ఆర్మీలోనే నువ్వు ఉండిపోవడంతో నా ఫీలింగ్స్ పట్టించుకునే వాళ్ళు ఎవరు అంటూ ఏడుస్తుంది. బయటికి వెళ్లి మందు తాగి బాధపడి మళ్లీ ఇంటికి వస్తాడు విజయ్.

ఈ క్రమంలో మదన్, సౌగంధిక ఒక గదిలో ఉంటారు. విజయ్ ని చూసి మదన పారిపోతాడు. భార్యను చంప మీద కొట్టి తను బాగా తాగి ఉండటంతో కింద పడిపోతాడు విజయ్. పొద్దున లేచి చూసేసరికి భార్య చనిపోయి ఉంటుంది. పోలీసులు విజయ్ ని అరెస్టు చేస్తారు. తన స్టోరీ చెప్తూ, అక్కడే బాగా రక్తం పోవడంతో చనిపోతాడు. విజయ్ చనిపోవడంతో సుబ్బన్న కంగారు పడిపోతాడు. ఎవరికి తెలియకుండా ఆ శవాన్ని మాయం చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో ఆ బాడీని ముక్కలు చేసి పొయ్యిలో వేసేస్తాడు. ఆ తర్వాత సుబ్బన్నకి దిమ్మతిరిగే రహస్యం తెలుస్తుంది. సౌగంధికను చంపింది ఎవరో కాదు సుబ్బన్న కొడుకు. వాళ్ళు దిగిన కొన్ని ఫోటోలను చూసి ఆ నిజం తెలుసుకుంటాడు సుబ్బన్న. చివరికి సుబ్బన్న కొడుకుని ఏం చేస్తాడు? సౌగంధికని సుబ్బన్న కొడుకే చంపాడా? పోలీసులు ఈ కేసును ఎలా సాల్వ్ చేస్తారు? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×