E-Paper
Advertisement

OTT Movie : భార్యకు అచ్చం భర్త లాగా కనిపించే బాయ్ ఫ్రెండ్… హెబ్బా పటేల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్

OTT Movie : భార్యకు అచ్చం భర్త లాగా కనిపించే బాయ్ ఫ్రెండ్… హెబ్బా పటేల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్
Advertisement

OTT Movie : ఓటిటిలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత సింగిల్ గా చూడాల్సిన సీన్స్ ఉన్నా సరే వెనకాడకుండా, ఎవరు లేని టైం చూసుకుని మరీ అలాంటి సినిమాలపై ఒక లుక్కెయ్యడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు మూవీ లవర్స్. అలా బ్యూటిఫుల్ సినిమాలంటే పడి చచ్చే వారి కోసమే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ టైటిల్ ఏంటి? ఏ ఓటిటిలో చూడొచ్చు? అని వివరాల్లోకి వెళ్తే…

ఈటీవీ విన్ (etv win)

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించగా, సుమన్ ఊట్కూరు హీరోగా నటించారు. ఈ మూవీ పేరు “సందేహం” (Sandeham) . ఈ లవ్ అండ్ ఎంగేజ్మెంట్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం ఈటీవీ విన్ (etv win) అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఊరికి ఉత్తరాన అనే సినిమా డైరెక్టర్ సతీష్ పరమ మీద ఈ మూవీకి కూడా దర్శకత్వం వహించారు. విష్ణు వర్షిని క్రియేషన్స్ బ్యానర్ పై సత్యనారాయణ పర్చా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో హెబ్బా పటేల్ నటనకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఇక ఓటిటిలో టాప్ లో ట్రెండింగ్ అవుతున్న ఈ మూవీలో శ్రీనివాస్ భోగి రెడ్డి, రాసిక శెట్టి, శ్వేతా వర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

కథలోకి వెళ్తే…

Advertisement

ఈ సినిమాలో హర్ష అనే అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి శృతిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఇది లవ్ మ్యారేజ్ లో కాకుండా పక్కాగా ప్లాన్ చేసి అరేంజ్డ్ మ్యారేజ్ లా చేసుకుంటాడు. ఫస్ట్ నైట్ రోజు శృతి హీరోకి షాక్ ఇస్తుంది. తనకు కొంచెం టైం కావాలని అడుగుతుంది. మరోవైపు అచ్చం భర్త లాగే ఉండే ఆర్య అనే అబ్బాయి హీరో ఉంటున్న అపార్ట్మెంట్ లోకి వస్తాడు. ఆ తర్వాత హర్ష స్తుతిలతో అతనికి పరిచయం పెరుగుతుంది. అప్పుడప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి అతను ఇబ్బంది పెట్టి వెళ్తూ ఉంటాడు. కానీ శృతి తో ఆర్య మసులుకునే విధానాన్ని హర్ష తట్టుకోలేక పోతాడు. ఏం జరిగింది అనే విషయాన్ని కనిపెట్టడానికి హీరోయిన్ కి తెలియకుండా ఓ మెంటల్ ప్లాన్ వేస్తాడు.

హీరోయిన్ భర్త తను కరోనాతో చనిపోయినట్టు ఫ్యామిలీ డాక్టర్ ద్వారా చెప్పిస్తాడు. అందరూ అతను చనిపోయాడు అనుకుంటున్న టైంలో తన చెల్లికి ఒక మిస్టరీ కాల్ వస్తుంది. దీంతో అనుమానం వచ్చిన హీరో చెల్లి తన అన్నయ్య నిజంగానే చనిపోయాడా అని ఆరా తీయడం మొదలు పెడుతుంది. మరి చివరికి ఆమె హీరో చనిపోయాడా లేదా అనే విషయాన్ని కనిపెట్టగలిగిందా? పోలీసులు హెబ్బాను ఎందుకు అరెస్ట్ చేస్తారు? అనే సందేహాలు తీరాలంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఈటీవీ విన్ (etv win) లో స్ట్రీమింగ్ అవుతున్న “సందేహం” (Sandeham) అనే ఈ సినిమాపై ఒక లుక్ వెయ్యండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×