E-Paper
Advertisement

OTT Movie : ఆ అడవిలో అడుగు పెట్టిన మనుషులు మాయం… వణుకు పుట్టించే హారర్ మూవీ

OTT Movie : ఆ అడవిలో అడుగు పెట్టిన మనుషులు మాయం… వణుకు పుట్టించే హారర్ మూవీ
Advertisement

OTT Movie : హర్రర్ మూవీస్ అంటే చెవి కోసుకునే మూవీ లవర్స్ చాలామంది ఉంటారు. థియేటర్లలో కొన్ని హర్రర్ మూవీస్ ప్రేక్షకులను భయపెట్టే విధానం ఒక రేంజ్ లో ఉంటుంది. థియేటర్లలో మిస్సయిన సినిమాలను ఓటిటిలో చూడగలుగుతున్నారు మూవీ లవర్స్. హర్రర్ మూవీస్ చాలా వరకు ఒంటరిగా రాత్రిపూట చూడటం సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని సీన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అటువంటి ఒక మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో ? తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో

Advertisement

ఈ మూవీలో మనుషులను చంపుతున్న మంత్రగత్తెను కొంతమంది చంపటం వలన ఆమె దయ్యంగా మారుతుంది. దయ్యం గా మారిన ఆమె చేసే అరాచకాలు అంతా ఇంతా కావు. ఇది ఒక తమిళ్ మూవీ. ఈ మూవీకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు “పేచీ”  (Pechi). ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళితే ..

Advertisement

ఒక అడవిలో వెకేషన్ కి ఒక జంట వెళ్తుంది. ఆ అడవిలోకి వెళ్ళగానే వాళ్లకు ఆ ప్రాంతం చల్లగా ఉండటంతో, చలిమంట వేసుకోవడానికి ఒక చెట్టును నరుకుతారు. ఆ చెట్టు నుంచి ఒక బొమ్మ బయటకి వస్తుంది. ఆ బొమ్మ లో ఉన్న ఆత్మ ఈ జంటని చంపుతుంది. మరోవైపు ఇదే అడవికి వెకేషన్ కి కొంతమంది వస్తారు. వారికి గైడ్ గా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ వస్తాడు. అతని పేరు  మారి. వీరికి  ఆ ప్రాంతం కొత్త కావడంతో గైడ్ చేయడానికి వస్తాడు. అయితే వీరు వెళుతున్న దారిలో ఒక్కొక్కరు మిస్ అవుతారు. అలా మిస్ అవుతుంటే మిగతవాళ్ళు భయపడతారు. మారి మాత్రం తాయత్తును కట్టుకొని ఉంటాడు. ఎందుకు మాయమవుతున్నారని భయపడుతూ మారిన అడుగుతారు ఆ టూరిస్ట్ లు. ఈ ఊరిలో ఒక ముసలి మంత్రగత్తెను చంపి, ఆమె ప్రేతాత్మగా మారకుండా ఒకచోట బంధించారని అంతవరకు మాత్రమే తనకు తెలుసని చెప్తాడు.

అయితే ఆ దయ్యం ఇదంతా చేస్తుందేమో అని మారి కూడా భయపడతాడు. చివరికి అడవుల్లోకి వెళ్లి కనబడకుండా పోయిన వాళ్ళు ఏమవుతారు? ఆ ముసలి మంత్రగత్తే వీళ్ళని చంపుతుందా? వీరంతా అక్కడినుంచి బయటపడగలిగారా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న పేచీ (Pechi) మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ముసలి దయ్యం వచ్చినప్పుడు గుండె ఆగినంతపని అవుతుంది. మరి ఎందుకు ఆలస్యం హర్రర్ థ్రిల్లర్ మూవీస్ చూసే మూవీ లవర్స్ ఈ సినిమాపై ఓ లుక్కేయండి. ఒంటరిగా మాత్రం చూడకండి. ఈ మూవీలో హర్రర్ సీన్స్ వేరే లెవల్ లో ఉంటాయి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×