E-Paper
Advertisement

OTT Movie : చిన్న పిల్ల అనుకుని దత్తత తీసుకుంటే… ఫ్యామిలీనే చిన్నాభిన్నం చేసే ముదురు పిల్ల

OTT Movie : చిన్న పిల్ల అనుకుని దత్తత తీసుకుంటే… ఫ్యామిలీనే చిన్నాభిన్నం చేసే ముదురు పిల్ల
Advertisement

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతూ మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాయి. థియేటర్లలో హల్చల్ చేసిన ఒక హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో

Advertisement

మూవీ లవర్స్ కి వెన్నులో వణుకు పుట్టించిన ఈ హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు “ఆర్ఫాన్” (Orphan). ఈ మూవీలో ఒక ఫ్యామిలీ ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటుంది. అమ్మాయి వల్ల ఆ ఫ్యామిలీ చిన్నా భిన్నం అవుతుంది. దత్తత తీసుకున్న అమ్మాయి చూట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

కేట్ జాన్ ఇద్దరు భార్యాభర్తలుగా ఉంటారు వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. కేట్ మూడోసారి ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే బిడ్డ పుట్టకుండానే అబార్షన్ అవుతుంది. ఈ బాధలో నుంచి బయట పడేందుకు ఈ జంట ఒక ఏస్తర్ అనే అమ్మాయిని దత్తత తీసుకుంటారు. ఆ అమ్మాయి ప్రవర్తన కాస్త వింతగా ఉంటుంది. ఒకరోజు కేట్ జాన్ ఇద్దరు ఏకాంతంగా ఉండగా కిటికీ లో నుంచి చూస్తుంది. చూడటమే కాకుండా కేట్ తో శృంగారం గురించి కొన్ని పాయింట్లు చెబుతుంది. అయితే చిన్నపిల్లలకి ఇంత నాలెడ్జ్ ఉండదని కేట్ ఏస్తర్ పై అనుమానంగా చూస్తుంది. ఇలా ఉంటే ఏస్తర్ ని దత్తత ఇచ్చిన ఫౌండేషన్ మనిషి కేట్ దగ్గరికి వచ్చి, ఎస్టర్ ఎక్కడ ఉంటే అక్కడ కొన్ని సమస్యలు వస్తాయని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఆమె వెళ్తుండగా ఎస్టర్ ఆమెను అత్యంత కిరాతకంగా చంపేస్తుంది. ఆ తర్వాత ఆశవాన్ని మాయం చేస్తుంది. తనకు తానుగా చెయ్యి విరుచుకొని కేట్ విరిచిందని జాన్ కి అబద్ధం చెప్తుంది. అలాగే కేట్ మందు తాగుతుందని జాన్ అపోహ పడేలా చేస్తుంది.

జాన్ తన భార్యకి పిచ్చి పట్టిందని డాక్టర్ చూపించాలనుకుంటాడు. ఈ లోగా ఒక డాక్టర్ కేట్ కు ఫోన్ చేసి ఎస్టర్ చిన్న పిల్ల కాదు అని చెప్తాడు. ఆమెకు 35 సంవత్సరాలు ఉంటాయని, ఆమెకున్న అరుదైన జబ్బుతో అలా కనపడుతుందని వివరిస్తాడు.  ఆమెను ఇంతకుముందు దత్తత తీసుకున్న వాళ్ళని చంపి పిచ్చాసుపత్రికి వచ్చిందని చెప్తాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న జాన్ ని ఏస్తర్ చంపేస్తుంది. ఇంటికి వచ్చిన కేట్ ని కూడా చంపడానికి చూస్తుంది. కేట్ తో పాటు పిల్లల్ని కూడా చంపాలని  చూస్తుంది. చివరికి ఆ సైకోని కేట్ ఎదుర్కొంటుందా? ఆ సైకో చేతిలో కేట్ బలవుతుందా? పిల్లలు సేఫ్ గా బయటపడతారా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×