E-Paper
Advertisement

OTT Movie : వరుసగా 18 హత్యలు చేసి పోలీసులకే హడల్ పుట్టించే సైకో… ఖతర్నాక్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : వరుసగా 18 హత్యలు చేసి పోలీసులకే హడల్ పుట్టించే సైకో… ఖతర్నాక్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఓటిటిలో ఎన్నో జానర్ల సినిమాలు అందుబాటులోకి ఉన్నాయి. కానీ అందులో అన్నింటికీ ఒకే రకమైన సపోర్ట్ మాత్రం ప్రేక్షకుల నుంచి ఉండదన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సినిమాలు అంటే వెంటనే గుర్తుచేది కొరియన్, మలయాళ సినిమాలు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కొరియన్ సినిమాలు అంటే చెవి కోసుకునే వారి సంఖ్య ఎక్కువైపోయింది. అందులోనూ సినిమా మొదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు ఎంగేజింగ్ గా ఉండే సైకో కిల్లర్ సినిమాలంటే ఇష్టపడే వారి సంఖ్య భారీగానే ఉంది. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ ఖతర్నాక్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొరియన్ సైకో కిల్లర్ మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. సీను సీనుకో ట్విస్ట్ తో, ఎక్స్పెక్ట్ చేయలేని మలుపులతో, ఎక్స్పెక్ట్ చేసే సస్పెన్స్, మిస్టరీ వంటి ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళ్తే…

Advertisement

సినిమా షురూ అవ్వగానే ఓ అమ్మాయి అర్ధరాత్రి ఇంటికి వెళుతూ కనిపిస్తుంది. అయితే మార్గమధ్యలో ఆమె వెళ్లే కారుకు ఓ పాప ఎదురొస్తుంది. దీంతో యాక్సిడెంట్ అయ్యిందేమోనని హీరోయిన్ భయపడుతుంటే, ఆ పాప హెల్ప్ చేయమంటూ ఆ అమ్మాయిని కోరుతుంది. తీరా పాపమని హెల్ప్ కోసం వెళ్తే తర్వాత రోజే ఆ అమ్మాయి శవమై తేలుతుంది. అయితే తల మిస్ అయి, అనుమానాస్పదంగా మిగిలిన బాడీ మాత్రం పోలీసులకు దొరుకుతుంది. ఆమె చేతిపై ఒక విచిత్రమైన టాటూ కూడా ఉంటుంది. ఇదే పద్ధతిలో ఈ అమ్మాయి తో కలుపుకొని ఏకంగా 18 వరుస హత్యలు జరుగుతాయి. అయితే ఎంత ప్రయత్నించినా పోలీసులు మాత్రం ఆ సైకోను పట్టుకోలేక పోతారు. దీంతో ఆ సైకోకి హెడ్ హంటర్ అనే పేరు పెట్టగా,  అంతలోనే ఈ సైకో కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కొడుకు, కూతుర్ని కిడ్నాప్ చేసి దారుణంగా చంపేస్తాడు. దీంతో ఇలాగైతే వాడిని పట్టుకోవడం కష్టమని భావించి, అమెరికా నుంచి ఒక సైంటిస్ట్ ని కొరియాకు తీసుకొస్తారు. ఈ సైంటిస్ట్ కు ఉన్న అద్భుతమైన స్కిల్ ఏంటంటే బిడ్డ తల్లి గర్భంలో ఉండగానే వాడు సైకోనా కాదా అనే విషయాన్ని కనిపెట్టగలడు. అంతేకాదు పుట్టబోయే బిడ్డ సైకోలా ఉంటాడు అని తెలిస్తే వెంటనే అబార్షన్ చేయిస్తాడు. ఇక అతనికి కొరియాలో ఓ ఫ్రెండ్ ఉండగా, అతని వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. మొత్తానికి అమెరికా నుంచి కొరియా వచ్చిన ఆ సైంటిస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి తన ఫ్రెండే ఆ హెడ్ హంటర్ అనే విషయాన్ని త్వరగానే కనిపెడతాడు. మరి ఎందుకు ఈ సైంటిస్ట్ ఫ్రెండ్ ఇలా దారుణంగా 18 హత్యలు చేశాడు? అతని భార్యకు పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే ‘మౌస్’ అనే ఈ సినిమాను రెంట్ బేసిస్ లో చూడాల్సి ఉంటుంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×