E-Paper
Advertisement

OTT Movie : ‘లిటిల్ హార్ట్స్’ – ‘ఎయిర్’ డిజిటల్ పాన్ ఇండియా ఎంట్రీ… అన్నీ భాషలలొ ఈ ఓటీటీలోనే స్ట్రీమింగ్ ?

OTT Movie : ‘లిటిల్ హార్ట్స్’ – ‘ఎయిర్’ డిజిటల్ పాన్ ఇండియా ఎంట్రీ… అన్నీ భాషలలొ ఈ ఓటీటీలోనే స్ట్రీమింగ్ ?
Advertisement

OTT Movie : చిన్న సినిమాగా వచ్చి బ్లాస్టింగ్ హిట్స్ గా నిలిచిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే ఎంత పెద్ద హిట్ అయినా కూడా తెలుగు సినిమాలే కాబట్టి ఓటీటీలలో కేవలం తెలుగులోనే అందుబాటులోకి వస్తున్నాయి. కానీ తాజాగా ఓ రెండు క్రేజీ హిట్ సినిమాలకు మాత్రం పాన్ ఇండియా ప్రేక్షకులను రీచ్ అయ్యే ఛాన్స్ దక్కింది. ఇప్పటిదాకా తెలుగులోనే అవైలబుల్ గా ఉన్న ఈ సినిమాలు ఇకపై అన్నీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ తో పాన్ ఇండియా ఎంట్రీ

ప్రముఖ యూట్యూబర్ మౌళి తనూజ్, శివానీ నాగారం ప్రధాన పాత్రల్లో నటించిన ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) మూవీ 2025లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిన్న సినిమాల్లో ఒకటి. మొదట్లో ETV Winలో డైరెక్ట్-టు-డిజిటల్ విడుదల కావాల్సిన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 90s దర్శకుడు ఆదిత్య హాసన్ దీనిని నిర్మించారు. ఈ సినిమా ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి ప్రధాన భారతీయ భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. అంటే ఇకపై అన్నీ భాషల ప్రేక్షకులు తమకు నచ్చిన భాషలో ఇంట్లో కూర్చునే ఈ హిట్ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు అన్నమాట.

Advertisement

ఇదే దారిలో నటించిన మరో సిరీస్ ‘ఎయిర్’ (AIR). ‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్, ప్రకాష్ జయతీర్థ, భాను ప్రకాష్ తదితరులు నటించిన ETV విన్ ఒరిజినల్ సిరీస్ AIR (ఆల్ ఇండియా ర్యాంకర్స్) కూడా ఇలాగే బహుళ భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజంలో ఈ రెండు తెలుగు ఒరిగినల్స్ అందుబాటులో ఉండటం ఓటీటీ మూవీ లవర్స్ కు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి.

Read Also : క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… 2025లో ఓటీటీని రఫ్ఫాడించిన లేడీ ఓరియెంటెడ్ సిరీసులు సినిమాలు

కథలోకి వెళ్తే…

Advertisement

అఖిల్ (మౌళి త‌నూజ్‌) పెద్దగా చదవకపోవడంతో ఎంసెట్‌లో ర్యాంక్ రాదు. డబ్బులతో సీటు కొని ఏదో ఒక కాలేజీలో ఇంజినీరింగ్ చేయాలి అనుకుంటాడు. అతని తండ్రి మాత్రం లాంగ్ ట‌ర్మ్ కోచింగ్‌కి పంపి షాక్ ఇస్తాడు. అచ్చం కాత్యాయ‌నిది కూడా ఇదే పరిస్థితి. ఆమె త‌ల్లిదండ్రులిద్ద‌రూ డాక్ట‌ర్లే కావడంతో కూతురిని కూడా డాక్టర్ ను చేయాలని ఆశపడతారు. ఇంట‌ర్ త‌ర్వాత లాంగ్‌ట‌ర్మ్ కోచింగ్‌లో చేరగా, అక్క‌డే అఖిల్‌ పరిచయం అవుతాడు. అది కాస్తా ప్రేమగా మారుతుంది. అఖిల్ ప్రపోజ్ చేయగానే కాత్యాయని తన సీక్రెట్ ను బయట పెడుతుంది. ఆ సీక్రెట్ ఏంటి? వీళ్ళిద్దరి ప్రేమ ఎక్కడికి దారి తీసింది ? అన్నది స్టోరీ. ఇక ‘ఎయిర్’ వెబ్ సిరీస్ విషయానికొస్తే… విజయవాడలోని ఒక ప్రతిష్టాత్మకమైన IIT కోచింగ్ సెంటర్‌కు వెళ్లిన ముగ్గురు విద్యార్థుల కథ.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×