E-Paper
Advertisement

OTT Movie : నిందితులకు భోజనం పెట్టి నిజాలను కక్కించే పోలీస్… చూశారంటే కడుపుబ్బా నవ్వాల్సిందే

OTT Movie : నిందితులకు భోజనం పెట్టి నిజాలను కక్కించే పోలీస్… చూశారంటే కడుపుబ్బా నవ్వాల్సిందే
Advertisement

OTT Movie : రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఒక కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి అడుగు పెట్టడానికి సిద్ధమైంది. ఇక ఈ సినిమాలో ఉండే పోలీస్ నిందితులకు కడుపు నిండా భోజనం పెట్టి నిజాలను రాబడుతూ ఉంటాడు. భోజనాన్ని ఆయుధంగా చేసుకుని ఈ పోలీస్ చేసే చేష్టలు చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటారు. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది? మూవీ పేరేంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Advertisement

కన్నడ నటుడు ప్రమోద్ శెట్టి లీడ్ రోల్ చేసిన కామెడీ ఎంటర్టైనర్ ‘లాఫింగ్ బుద్ధ’. ఆగస్టు 30న థియేటర్లలోకి వచ్చిన ఈ కామెడీ డ్రామా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాను రిషబ్ శెట్టి నిర్మించడం విశేషం. ‘లాఫింగ్ బుద్దా’ మూవీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ మేరకు చిత్రాన్ని అక్టోబర్ 18న ఓటిటిలోకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు గాని ఈ మూవీ ప్రైమ్ వీడియోలో ముందు ఓవర్సీస్ లో స్ట్రిమింగ్ అవుతుందా లేదంటే ఇండియాలో కూడా ఒకేసారి అందుబాటులోకి రానుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే ‘లాఫింగ్ బుద్ధ’ మూవీ రిలీజ్ కాకముందు డిజిటల్, సాటిలైట్ రైట్స్ ఇంకా అమ్ముడు పోలేదని రిషబ్ శెట్టి వెల్లడించారు. కానీ ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ రైట్స్ ను దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ‘లాఫింగ్ బుద్ధ’ మూవీకి భరత్ రాజ దర్శకత్వం వహించగా, ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ఓ పోలీస్ ఆఫీసర్ పడిన ఫన్నీ పాట్ల చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఈ సినిమాకు విష్ణు విజయ్ సంగీతం అందించగా, రిషబ్ శెట్టి పతాకంపై రిషబ్ నిర్మించారు. నిజానికి ఆయనే ఈ సినిమాలో నటించాలి అనుకున్నారట. కానీ ‘కాంతారా’ సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకు నిర్మాతగా మారారు.

స్టోరీలోకి వెళ్తే.. 

Advertisement

గోవర్ధన్ ఒక పోలీస్ కానిస్టేబుల్. కానీ అతనికి ఆహారం అంటే ఎనలేని ఇష్టం. ఎంత తిన్నా సరే కడుపు నిండదు అన్నట్టుగా ఎప్పుడూ తింటూనే ఉంటాడు. అక్కడితో ఆగకుండా జైలులో ఉండే నిందితులకు కూడా నిజాలు కక్కే వరకు తిండి పెడుతూ ప్రేమగా మాట్లాడుతాడు. ఈ విధంగా ఆహారాన్ని ఆయుధంగా చేసుకొని కేసులను సాల్వ్ చేస్తాడు. అది మంచి విషయమే అయినప్పటికీ ఇలా ఆహారం ఎక్కువగా తినడం వల్ల గోవర్ధన్ బాగా బరువు పెరిగి, ఉబకాయంతో బాధపడతాడు. ఇక అతన్నిఫిట్ గా లేకపోవడంతో ఉన్నతాధికారులు మూడు నెలల్లో బరువు తగ్గాలని టార్గెట్ పెట్టి, ఒకవేళ అప్పటికి కూడా బరువు తగ్గకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామని హెచ్చరిస్తారు. మరి ఆ తర్వాత గోవర్ధన్ ఏం చేశాడు? బరువు తగ్గడానికి అతని పడిన పాట్లు ఏంటి? చివరికి ఉద్యోగాన్ని కాపాడుకున్నాడా లేదా ? అనే విషయం తెలియాలంటే ‘లాఫింగ్ బుద్ధ‘ అనే ఈ కన్నడ సినిమాను చూడాల్సిందే.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×