E-Paper
Advertisement

OTT Movie : తన శవాన్ని తానే పాతిపెట్టే హీరో… క్రేజీ ఫ్యాంటసీ థ్రిల్లర్ తెలుగులో

OTT Movie : తన శవాన్ని తానే పాతిపెట్టే హీరో… క్రేజీ ఫ్యాంటసీ థ్రిల్లర్ తెలుగులో
Advertisement

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన మూవీస్ కొద్ది రోజుల్లోనే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకుని ప్రస్తుతం ఒక మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచితనానికి వచ్చే ఇబ్బందులు ఈ మూవీలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. ఈ క్రేజీ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రిమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.

ఈటీవీ విన్ (Etv win)

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ పేరు “కలి” (Kali). హీరో తన మంచితనంతో ఆస్తులతో పాటు భార్యను కూడా పోగొట్టుకొని, ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడంతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ (Etv win) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

ఈ మూవీలో హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఎదిరించి అతడిని పెళ్లి చేసుకుంటుంది. వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. అయితే సమస్య హీరో మంచితనంతో వస్తుంది. హీరోను బాబాయ్ బిజినెస్ కోసం డబ్బులు తీసుకొని మోసం చేస్తాడు. ఆస్తిని బ్యాంకులో తాకట్టుపెట్టి హీరోకి అ న్యాయం చేస్తాడు. భార్య వద్దని చెప్పినా కూడా వినకుండా ఇలా చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. ఒకరోజు యాక్సిడెంట్ లో ఒక వ్యక్తి రోడ్డు మీద పడి ఉంటే అతడిని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. అయితే హీరోనే యాక్సిడెంట్ చేసి, పేషెంట్ ని తీసుకువచ్చాడని పోలీసులు కేసు నమోదు చేస్తారు. భార్య బెయిల్ తీసుకొని వచ్చి, ఎందుకు వేరే వాళ్ళ సమస్యల్లో తల దురుస్తావు అంటూ గొడవపడి వెళ్ళిపోతుంది. ఇవన్నీ చూసిన హీరో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇంతలో కలి అనే వ్యక్తి హీరో ఇంటికి వస్తాడు. అతడు ఆత్మహత్య చేసుకునే లెటర్ లో హీరో ఏమి రాశాడో అన్నీ చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు.

ఇంతలో కలి ఒక గేమ్ ఆడమని హీరోకు చెప్తాడు. ఆ గేమ్ ఆడిన తర్వాత హీరో కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ఇంట్లో ఒక బెడ్ మీద శవం పడి ఉంటుంది. అది ఎవరిదో కాదు హీరోదే. హీరో అతడి రూపాన్ని అతని కళ్ళ ముందరే చూసుకొని ఆశ్చర్యపోతాడు. ఆ శవాన్ని తీసుకొని ఇంటి బయట గోతిలో పాతి పెడతాడు. ఆ తరువాత హరో కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుంటాడు.  ఇంతకీ హీరో ఇంటికి వచ్చి గేమ్ ఆడిన వ్యక్తి ఎవరు? హీరో నిజంగానే ఆత్మహత్య చేసుకుంటాడా? హీరో తన భార్యతో మళ్లీ కలసి జీవిస్తాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈటీవీ విన్ లో  స్ట్రీమింగ్ అవుతున్న “కలి” (Kali) అనే ఈ మూవీని తప్పకుండా చూడండి. ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీలను ఇష్టపడే మూవీ లవర్స్ ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. మరెందుకు ఆలస్యం ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీపై ఓ లుక్ వేయండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×